ఒకప్పటి మద్రాసు నగరంలోని స్వాగత్ హోటల్ లోని ఒక గది. ఇద్దరు వ్యక్తులు ఆ గది దగ్గరకు వచ్చి కాలింగ్ బెల్ నోక్కబోయారు. లోపలినుంచి ఏవో శబ్దాలు వినబడ్డాయి. అవేమిటో వినాలని ఇద్దరూ చెవులు రిక్కించారు. లోపల ఎవరో ఇద్దరు గొడవ పడుతున్నట్లున్నారు. చాలా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరుగుతోంది. వాళ్ళకేమీ అర్థం కాలేదు. బెల్ నొక్కడం మానేసి అలా వింటూ వుండిపోయారు. కొంతసేపటికి లోపల్నుంచి శబ్దాలు ఆగిపోయాయి. ధైర్యం చేసి బెల్ నొక్కారు. తలుపు తెరుచుకుంది. లోపలి వ్యక్తి నవ్వుతూ ఈ ఇద్దర్నీ లోపలికి ఆహ్వానించారు. లోపలి వెళ్ళిన ఆ ఇద్దరూ అంతా పరిశీలనగా చూసారు. ఎక్కడా రెండవ వ్యక్తి కనబడలేదు. వారి అవస్థ గమనించిన ఆ గదిలోని వ్యక్తి విషయం అడిగారు.
" ఇందాక ఈ గదిలో ఎవరో ఇద్దరు గొడవ పడినట్లు వినిపించింది. మీరు కాక ఎవరున్నారా అని చూస్తున్నాం " అన్నారిద్దరూ.
దానికి లోపలి వ్యక్తి నవ్వి " ఇద్దరూ నేనే ! ఇంకొకరెవరూ ఇక్కడ లేరు. మీరు విన్న వాదన ఈ స్క్రిప్ట్ లోది. రేపు మీ షూటింగ్ కి కావాల్సిన సీన్లు సిద్ధం చేస్తున్నాను. ఆ సీన్లలో వాదించుకునేవారి సంభాషణలను నేను అనుకుంటూ రాస్తున్నానంతే ! " అన్నారు.
అప్పటికి వచ్చిన వారికి విషయం అర్థమయింది. కుదుటపడ్డారు.
ఆ వచ్చినవారు జెమిని పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ శాఖ వాళ్ళు. ఆ సంస్థ అప్పట్లో నిర్మిస్తున్న ' భామావిజయం ' చిత్రం స్క్రిప్ట్ కోసం వచ్చిన సందర్భం. ఆ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ గారు.
రాధాకృష్ణ గారు సంభాషణలు రాసేటపుడు వాటిని ఆయా పాత్రల స్వరబేధంతో పైకి అనుకుంటూ రాయడం అలవాటు. అది పరోక్షంగా వినే వాళ్లకు వేర్వేరు వ్యక్తులు మాట్లాడినట్లే వుండి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతినిచ్చేది. అందుకే అందరూ నిద్రపోయే సమయంలో అర్థరాత్రి పూట రాయడం భమిడిపాటి వారికి అలవాటు.
...... ఇదీ భమిడిపాటి రాధాకృష్ణ గారి ప్రత్యక్ష పురాణం
Vol. No. 02 Pub. No. 199
2 comments:
బాగుంది.
ఫణి ప్రసన్న కుమార్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment