Thursday, April 7, 2011

సు ' జాత '

 రోజూ ఏదో సమయంలో నెట్ చూడడం లేదా టీవీ వార్తలు చూడడం అలవాటు. ఈరోజు కొంచెం పనివత్తిడి ఎక్కువగా వుండి సాయింత్రం వరకూ ఏదీ చూడలేదు. అందుకే సుజాత గారి మరణవార్త ఆలస్యంగా తెలిసింది. తెలిసాక ఏదో రాయాలని అనుకున్నాను గానీ ఏం రాయాలో తెలియలేదు.



మనకి ప్రస్తుతం మంచి నటులు, నటీమణులు కరువై పోతున్నారు. వారసత్వాలు, కులమతాలు, ఆశ్రిత పక్షపాతాలు, కొన్నిచోట్ల డబ్బు, ఇతర ఆకర్షణలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మంచి నటీనటులు దొరుకుతారని కోరుకోవడం అత్యాశేనేమో ! నటన కంటే వీటికే పెద్ద పీట వేస్తోంది చిత్ర పరిశ్రమ. అలాంటప్పుడు గత తరం నాయికగా, ఈ తరం క్యారెక్టర్ నటిగా రెండు తరాల మధ్య వారధిగా నిలిచిన సుజాత కనుమరుగైపోవడం బాధాకరం. నెమ్మదిగా ఒకరొకరే వెళ్ళిపోతున్నారు. అంటే ఇకపైన మంచి నటన అనేది చిత్రరంగంలో కరువైపోతుందేమో !

తెలుగుని తెలుగులా మాట్లాడలేని, అసలు తెలుగే రాని, అంగాంగ ప్రదర్శనే నటన అని, ప్రేక్షకులు కూడా తమనుంచి అదే కోరుకుంటున్నారనే భ్రమలో తాము ఉండి, పరిశ్రమను వుంచి ప్రేక్షకుల నెత్తిన బలవంతంగా అవే రుద్దుతున్న పరాయి భాషా నటీమణులు సుజాతను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. నటనలో మాత్రమే కాదు. ప్రవర్తనలో కూడా ఆమె నుంచి నేర్చుకోవలసింది కూడా ఎంతైనా ఉంది. భాషా బేధం లేకుండా ఇతర భాషలు కూడా నేర్చుకుని సంభాషణలను స్వంతం చేసుకుని, అర్థం చేసుకుని వాటిలోని భావ ప్రకటనను తన నటనలో చూపగల దిట్ట సుజాత.

ఆమె మరణంతో మరో మంచి నటీమణిని పరిశ్రమ కోల్పోయింది. ఆమెకు ఇదే అశ్రు నివాళి.


Vol. No. 02 Pub. No. 192

8 comments:

Anonymous said...

She was a good actor.

సుజాత వేల్పూరి said...

అవును రావు గారూ, సహజ నటులు ఒక్కొక్కరే దూరమైపోవడం బాధాకరం! గుప్పెడు మనసులో ఆమె పాత్రను బాల చందర్ మలిచిన తీరు అధుతం! ఎంతో స్థిరత్వం కలిగిన పాత్ర!

ఆమె కుటుంబ జీవితానికి ప్రాముఖ్యం ఇచ్చి పార్టీలు సమావేశాలకు అసలు వచ్చేవారు కాదని నిన్న చాలా మంది సహనటులు గుర్తు చేసుకోవడం ఆశ్చర్యాన్ని, ఆమెపట్ల మరింత గౌరవాన్ని కల్గించింది.

SRRao said...

* అజ్ఞాత గారూ !

ధన్యవాదాలు. దయచేసి మీ పేరు..... ఈసారైనా....

* సుజాత గారూ !

నిజమేనండీ ఆవిడ ఇప్పటి నటీమణులకు రోల్ మోడల్. ధన్యవాదాలు.

Anonymous said...

Why do you people are after names of commentors? Leave them alone. Stop bugging them. Respect their preferences and opinions to stay as anons.
Block their comments if you guys are intolerant of their presence. This is crazy.

SRRao said...

అజ్ఞాత గారూ !

వ్యాఖ్యలు చేసేవారి అభిప్రాయాలను ఎప్పుడూ బ్లాగర్ మిత్రులందరూ తప్పక గౌరవిస్తారు కాబట్టే వ్యాఖ్యలకోసం అవకాశం కల్పించడం జరుగుతోంది. లేకపోతె మీరన్నట్లు అజ్ఞాతలను నిషేధించడమో, అసలు వ్యాఖ్యలను నిషేధించడమో జరుగుతుంది. అయితే బ్లాగర్లేవరో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నట్లే.... మెచ్చుకుంటూనో, విమర్శిస్తూనో వ్యాఖ్య రాసిన వారెవరో తెలుసుకోవాలనే కుతూహలం బ్లాగర్లకు కూడా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీకిష్టమైతే చెప్పవచ్చు లేకపొతే లేదు గానీ ఇలా కోపం తెచ్చుకోవడం మాత్రం సరైనది కాదని నా అభిప్రాయం. నిషేధించడం, లేకపోవడం అనేది పూర్తిగా ఆయా బ్లాగర్ల ఇష్టం. అలాగే వ్యాఖ్యల ప్రచురణ కూడా ఆయా బ్లాగర్ల ఇష్టం. ఎందుకంటే ఆయా బ్లాగులు వారి వారి స్వంతం. వారి టపాలై మనకి తోచిన అభిప్రాయాలు చెప్పడం వరకే మన బాధ్యత.

అయినా వ్యాఖ్యల్లో అభ్యంతకరమైనది, అనుచితమైనదీ కాకుండా ఆరోగ్యకరమైన విషయం రాస్తున్నపుడు అజ్ఞాతంగా ఉండాల్సిన అవసరం లేదనుకుంటాను. అలా రాసినపుడు పేరు అడిగే హక్కు బ్లాగర్లకు ఉందనుకుంటాను.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

/అయినా వ్యాఖ్యల్లో అభ్యంతకరమైనది, అనుచితమైనదీ కాకుండా ఆరోగ్యకరమైన విషయం రాస్తున్నపుడు అజ్ఞాతంగా ఉండాల్సిన అవసరం లేదనుకుంటాను. అలా రాసినపుడు పేరు అడిగే హక్కు బ్లాగర్లకు ఉందనుకుంటాను./
అజ్ఞాతలు తిట్టేటప్పుడే ముసుగేసుకుని తిట్టాలి. పొగిడేటప్పుడు ముసుగులు తీసి పొగడాలి. :)
అనుకోవడంలోనూ, అడగటం లోనూ తప్పులేదు రావు గారు. బాగా అడిగారు.
ఐతే...
'అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్నీ' :)

SRRao said...

శంకర్ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం