Tuesday, March 1, 2011

రమణ చలవ


సూర్యకాంతమ్మ గారికి అసలు కొడుకు బాపు అయితే ... పెద్దకొడుకుగా చలామణీ అయినది రమణ. బాపురమణల అనుబంధం గురించి ఎంత చెప్పినా తరగదు. సూర్యకాంతమ్మ గారికి వారి అనుబంధం మీద ఎంత గురో చెప్పడానికి ఓ సంఘటన............





బాపు గారి ' సీతాకల్యాణం ' చిత్రం లండన్ చలన చిత్రోత్సవానికి ఎంపికయింది. ఆ కారణంగా ఆయన లండన్ ప్రయాణమయ్యారు. ఈ శుభవార్త చెప్పి తల్లి గారికి చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళారు బాపు. ఆమె కాళ్ళకు నమస్కరించగానే సూర్యకాంతమ్మ గారు కొడుకుతో ..........

" నీక్కాస్త పేరేదైనా వస్తే అంతా రమణ చలవే ! అతని వల్లే ! అతనికి దణ్ణం పెట్టు ! " అన్నారట.

ఈ మాటోక్కటి చాలదూ ! బాపు గారి ఔన్నత్యం వెనుక రమణ గారి కృషి ఎంత వుందో.... బాపురమణల అనుబంధం ఎంత గొప్పదో ... ఇలాంటి అపురూపమైన స్నేహాన్ని మళ్ళీ చూడగలమా !

Vol. No. 02 Pub. No. 161

8 comments:

Anonymous said...

సూర్యకాంతం గారి అబ్బాయా మన బాపు గారు? ఇంటర్నెట్ లో ఎక్కడా దొరకలేదు నాకు బాపు గారి తల్లి తండ్రుల వివరాలు. ఆవిడ బాపు గారికి కన్న తల్లా లేక పిన్నమ్మ పెద్దమ్మా వరుసా?

ఆ.సౌమ్య said...

బలే విషయం చెప్పారు..మీకివన్నీ ఎక్కడ దొరుకుతాయండీ?
పై అజ్ఞాత....సూర్యకాంతం అంటే మన సినిమా సూర్యకాంతం గారు కాదేమో!. బాపూ గారు అమ్మగారి పేరు కూడా సూర్యకాంతమే అయుంటుంది.

Unknown said...

Excellent! Your work highly appreciated

SRRao said...

* అజ్ఞాత గారూ !
ఆ. సౌమ్య గారు సందేహపడినట్లు ఆమె నటి సూర్యకాంతం గారు కాదు. బాపు గారి తల్లి గారి పేరు కూడా సూర్యకాంతమే ! బాపు గారి అధికారిక సైట్ బాపుబొమ్మ. కామ్ లోనే ఈ విషయం వుంది. ఆ లింక్ -
బాపుబొమ్మ

* ఆ. సౌమ్య గారూ !
ముందుగా ధన్యవాదాలు. ఇవన్నీ పాత పత్రికల, పుస్తకాల నుండి సేకరించినవేనండీ ! ఈ టపాలో రాసిన విషయం 2003 లో ఈటీవీ 'భాగవతం ' తయారవుతున్న సమయంలో ఈనాడు ఆదివారంలో ప్రచురించిన వ్యాసం నుండి సేకరించిన ఓ తునక.

SRRao said...

* గీతా మాధురీ !
ధన్యవాదాలు

SRRao said...

దుర్గేశ్వర గారూ !
ధన్యవాదాలు. తప్పక ఆలోచిస్తాను.

విజయవర్ధన్ (Vijayavardhan) said...

రావు గారు,
బాపు గారి అధికారిక సైటు:
http://www.bapuartcollection.com/
ఈ టపాలో పెట్టిన photo high qualityలో వుంటే నాకు దయచేసి mail చేయగలరా?
ధన్యవాదాలతో
భవదీయుడు
విజయ్

SRRao said...

విజయవర్ధన్ గారూ !
ధన్యవాదాలు. మీరడిగిన ఫోటో మరీ అంత హై క్వాలిటీ కాదు గానీ అది ఒక పత్రికలోనుంచి ( ఆంధ్రజ్యోతి అనుకుంటాను ) తీసుకున్నది. మీకు కావాలంటే తప్పక పంపుతాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం