డి.వి. నరసరాజు గారు సంభాషణలు చమత్కారాలు, వ్యంగ్యాలతో నిండి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. నరసరాజు గారు రాసిన ఒకేఒక పాట " మావూరి గంగ " ( 1975 ) చిత్రంలో వుంది. దాని ట్యూనింగ్ సమయంలో జరిగిన సంఘటన.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మరో పాట రాయడానికి ఆ సమయంలో రావడం జరిగింది. నరసరాజుగారి కుమార్తె కూడా అప్పుడు అక్కడే వుంది. కృష్ణశాస్త్రి గారికి ఆమెను
" మా అమ్మాయి కవిత " అంటూ పరిచయం చేశారు.
శాస్త్రి గారు వెంటనే " అదెలా సంభవం ? నేనొప్పుకోను. న్యాయమైతే ఆ అమ్మాయి పేరు నాటిక అని వుండాలి " అని రాసారు.
నరసరాజు గారి పాట ట్యూనింగ్ అయిపొయింది. కృష్ణశాస్త్రిగారు పాట విన్నారు. ఎవరు రాసారని అడిగారు. నరసరాజు గారని చెప్పగానే మళ్ళీ
" మా అమ్మాయి పేరు కవిత " అన్నారు.
" ఇప్పుడు ఒప్పుకుంటాను " అంటూ ఇంకా ఏదో రాసి కవితకు ఇచ్చారు. అందులో
" మీ నాన్నగారు పాటలు కూడా రాసి మా నోట్లో మట్టి కొట్టేలా వున్నారు " అని వుంది.
Vol. No. 01 Pub. No. 351
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
3 comments:
డియర్ SRRao గారూ!
రెండు నెలల నించీ మీ బ్లాగు చూస్తూనే వున్నాను కానీ కామెంటు చెయ్యడం తటస్థించలేదు.
అరుదైన ఇలాంటి చెణుకులంటే నాకు చాలా ఇష్టం.
మరిన్ని వ్రాస్తూ వుండండి.
good 'chenuku'.
* కృష్ణశ్రీ గారూ !
శిరాకదంబానికి స్వాగతం. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
* మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment