
మధుర కవి డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు
భావగీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు ఎన్నో ఎన్నెన్నో...
మధురమైన రచనలు ఎన్నిటినో ఆయన కలం అందించింది
ఆ గీతాల ఆలాపనతో గాయనీ గాయకులు తరించారు
ఆ గీతాలు ప్రసారం చేసి ఆకాశవాణి పులకించింది
తెలుగు కవితామతల్లి ముద్దుబిడ్డ డా. వక్కలంక
అందుకేనేమో ఆ తల్లి అన్నట్లుంది పుడమిని చాలింకని
ఆయన కవితాగంధం పరిమళాలని తాము కూడా అందుకోవాలని
అందుకేనా వెళ్ళిపోయారు ఆతల్లి మాట జవదాటనని
పాటంటే ఏమిటో పరిచయం చేశారు
కవిత్వాన్ని రుచి చూపించారు
భాషలోని సొగసుని తెలిపారు
దగ్గరుండి అక్షరదోషాలు సవరించారు
ఈనాడు ఈ మాత్రం భాషా జ్ఞానం ఆయన భిక్ష
ఈ మాత్రం రాయగలిగే దైర్యమిచ్చింది ఆయన శిక్షణ
ఆయన పుస్తకాలకు మేలు ప్రతులను రాసే వరమివ్వడం నా అదృష్టం
ఆ మహానుభావుడి శిష్యరికం నా జీవితంలో మరువలేని ఘట్టం
మరణం అనివార్యమని తెలుసు
మనమెవరం తప్పించుకోలేమని తెలుసు
ఇదంతా ఆ పరిస్థితి ఎదురవనంతవరకూ మాత్రమే
ఎదురైనప్పుడు మాత్రం తట్టుకోవడం కష్టమే !
అందుకే ఆయన లేరనే విషయం నమ్మబుద్ధి కావటం లేదు
ఆయన అందించిన కవితా జ్యోతులు వెలుగుతూనే వున్నాయి
ఆయన వినిపించిన గీతాలు సుస్వరాలను పంచుతూనే వున్నాయి
అవి ఎప్పుడూ...ఎల్లప్పుడూ...... సంగీత, కవితా ప్రియుల మనస్సులో నిలిచే వుంటాయి
గురువు గారికి అశ్రునయనాలతో ఆయన రాసిన ఆణిముత్యాలలో ఒకటి .................
ఆదివారం ( 11 - 07 - 2010 ) హైదరాబాద్ త్యాగరాయ గాన సభ లో జరిగిన సంతాప సభ వార్త - ఆంధ్రజ్యోతి నుండి.....
Vol. No. 01 Pub. No. 347
5 comments:
అమలాపురం ఎస్.కె.బి.ఆర్. కాలెజీలో శ్రీవక్కలంక లక్ష్మిపతిరావుగారి వద్ద చదువుకునే అదృష్టం నాకు 1959-61 ల్లో కలిగింది.
మా నాన్నకి బాగా సన్నిహితుడు. తీర్ధ యాత్రల మీద ఆల్బం ( ఎస్.జానకి, బాలూ, పి.బి.శ్రీనివాస్ అనుకుంటా ) పాడిన ఎల్.పి రీఅకార్డు రిలీజు అమలాపురం కోనసీమా బ్యాంకులో జరిగింది నాకింకా గుర్తు. తెలుగు పాఠం మాత్రం బాగా చెప్పేవారు. ఒక్కో సాహితీకుసుమం రాలిపోతోంది. ఇహ పరిమళమొక్కటే మిగిలింది. ఇలాంటి వార్తలు బాధనీ, దుఃఖాన్నీ మిగులుస్తాయి. లక్ష్మీపతి రావు గారి ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం.
-సాయి బ్రహ్మానందం
may his soul rest in peace.
Brahmanandam garu,
Is that record available now?
* హరేఫల గారూ !
ధన్యవాదాలు
* బ్రహ్మానందం గారూ !
ఆ ఆల్బం పేరు ' ఆంద్ర పుణ్యక్షేత్రాలు '. దాన్ని బాలు, జానకి పాడారు. కొంతకాలం క్రితంవరకూ ఆంద్ర దేశంలోని దేవాలయాలన్నిటిలోను వినిపిస్తూ ఉండేది. ధన్యవాదాలు.
* మాధురి గారూ !
అప్పట్లో రికార్డులుగా విడుదలైన ఆ ప్రైవేట్ ఆల్బం బహుళ ప్రజాదరణ పొందింది. HMV వాళ్ళు మళ్ళీ ఇటీవలికాలంలో విడుదల చెయ్యలేదు. నా దగ్గర కాసెట్ లో ఉండేది. మాస్టారికి HMV వాళ్ళిచ్చిన రికార్డు పాడైపోయింది. ఆయన దగ్గరుండే కాసెట్ కూడా ప్రస్తుతం జాడ లేదు. చాలాకాలంగా ప్రయత్నిస్తూనే వున్నాం. దొరికితే మాత్రం అందరికీ అందిస్తాను. సాహిత్యం మాత్రం ఇవ్వగలను. ధన్యవాదాలు.
Post a Comment