Tuesday, July 13, 2010

పుగళేంది - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 22 
 జవాబులు 

జ్యోతి గారు 5 వ ప్రశ్నకు సరైన సమాధానమిచ్చారు. 1 వ ప్రశ్నకు కూడా దాదాపుగా సరైన సమాధానమే ! వారికి ధన్యవాదాలు. స్పందించిన మాధురి గారికి కూడా ధన్యవాదాలు. ఇక జవాబులు ......................

1.  పుగళేంది అసలు పేరేమిటి ?


జవాబు : వేలప్పన్ 
( కొన్నిచోట్ల జ్యోతి గారు చెప్పిన ' వేలాయుధన్ నాయర్ ' అని కూడా కనిపిస్తుంది. పుగళేంది అనే పేరుతో ప్రసిద్దులవడం వలన అసలు పేరు విషయంలో ఈ కన్ఫ్యూజన్  )

2 .  పుగళేంది అనే పేరు ఎక్కడినుంచి గ్రహించారు ?

జవాబు : ' పుగళేంది పులవర్ ' అనేది ఒక ప్రముఖ తమిళ సాహిత్యకారుని పేరు. ఆయన మీద అభిమానంతో ఆ పేరులోని ' పుగళేంది ' ని తన వృత్తి నామం చేసుకున్నారు.

3 . పుగళేందికి ఒక ముద్దు పేరు వుంది. మామ కూడా తరచుగా అదే పేరుతో పిలిచేవారు. ఆ పేరేమిటి ? 


జవాబు : ఆయన ముద్దు పేరు ' అప్పూ '

4 . పుగళేంది జన్మస్థలం ఏమిటి ?


జవాబు : తిరువనంతపురం

5 . పుగళేంది కొన్ని తెలుగు చిత్రాలకు స్వతంత్ర్యంగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలేమిటి ?


జవాబు : విశాలి, వింతకథ, పసివాని పగ, జడగంటలు ... ఇంకా కొన్ని ప్రైవేటు ఆల్బమ్స్ కు కూడా స్వతంత్ర్యంగా సంగీతం సమకూర్చారు. 

Vol. No. 01 Pub. No. 346

4 comments:

విజయవర్ధన్ (Vijayavardhan) said...

రావు గారు, "వింత కథ" సిన్మా కృష్ణ గారు నటించిందేనానండి. ఆ సినిమా దొరుకుతుందా?

SRRao said...

విజయవర్ధన్ గారూ !
' వింతకథ ' కృష్ణగారు నటించినదేనండీ ! కానీ ఆ సినిమా దొరకడం కష్టమనుకుంటాను. సీడీల్లో విడుదలయిన దాఖాలాలు లేవు.

Amarakosham said...

Hello sir,Your effort on sharing your memories and other info thru this blog is greatly appreciable.What else we can say on your cntributions....THANK YOU.!

Amarakosham said...

Hello sir,Your effort on sharing your memories and other info thru this blog is greatly appreciable.What else we can say on your cntributions....THANK YOU!!

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం