
ఒకసారి ఆయన హరికథ చెబుతుండగా ఒక శ్రోత లేచి
" అయ్యా ! దాసుగారూ ! మీరు గోసంరక్షణ పేరుతో చాలా డబ్బు వసూలు చేసారు. అదంతా మీరే కైంకర్యం చేసేసారని అభియోగం. దీనికి మీ సమాధానం ఏమిటి ? " అని అడిగాడు నిలదీసే ధోరణిలో.
దానికి దాసు గారు ఏమాత్రం తొట్రుపాటు లేకుండా చిరునవ్వు నవ్వి
" వెర్రి నాయనా ! నేను కూడా గంగిగోవు లాంటి వాడినే. ముందు నన్ను నేను రక్షించుకోవాలి కదా ! అందుకే ఆ ద్రవ్యంతో నన్ను నేను రక్షించుకున్నాను. మరి నేను గోసంరక్షణ చెయ్యలేదంటావా ? "
అనగానే సభికులందరూ ఘొల్లున నవ్వారట.
Vol. No. 01 Pub. No. 336
2 comments:
It's not clear whether he really 'knocked' the money or was just joking.
మాధురి గారూ !
ఆదిభట్ల వారి మాటల్లో చమత్కార శ్లేష తెలుస్తోంది కదండీ !
Post a Comment