Monday, July 26, 2010

కార్గిల్ అమర వీరులకు జోహార్లు

 దేశరక్షణలో నిస్వార్థంగా 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం చేసి ప్రాణాలర్పించిన  వీరుల గౌరవార్థం ఈరోజు కొంత సమయం కేటాయిద్దాం. 

మనం సినీ నటుల్నో, క్రికెటర్ లనో ఆరాధించేముందు వారి కంటే ఆ ఆరాధనకు నిజంగా అర్హులైన వాళ్ళు వేరే  వున్నారని గుర్తించాలి.  ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా వారి త్యాగాలకు ప్రణామాలర్పిస్తూ.....


1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు తన కుటుంబానికి రాసిన లేఖలోని సారాంశం :పాకిస్తాన్ నుండి మన చివరి పర్వతాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నాం. 
కానీ విలువైన గొప్ప సైనిక సోదరుల్ని పోగొట్టుకున్నాం. ఈరోజు వారిని స్మరించుకోవాల్సిన తరుణం.


 కార్గిల్ యుద్ధంలో అమరులైన

 


 

కు అంజలి ఘటిద్దాం !

లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా  అతని జ్ఞాపకంగా అతను ధరించిన యూనిఫారం
కెప్టైన్ విక్రం బాత్రా
పరమ వీర చక్ర ( మరణానంతరం )
    


 

  

గ్రేనడీర్ యోగేంద్ర సింగ్ 
పరమ వీర చక్ర

 

RFN .సంజయ్ కుమార్
(పరమ వీర్ చక్ర ) 

 
 
మేజర్ పద్మపాణి ఆచార్య,
మహా వీర్ చక్ర ( మరణానంతరం )
 2 వ బెటాలియన్, రాజపుటాన రైఫిల్స్

 


లెఫ్టినెంట్ బలవాన్ సింగ్,
మహా వీర్ చక్ర
18 వ బెటాలియన్, గ్రేనేడర్స్ రెజిమెంట్ 


 


మేజర్  M శరవణన్,
వీర్ చక్ర ,
1 బీహార్   
లెఫ్టినెంట్ కనద్ భట్టాచార్య,
సేన మెడల్ ( మరణానంతరం )(
22 సంవత్సరాలు )
సిఖ్ లి
 

కెప్టైన్ సాజు చెరియన్ ,
సేన మెడల్
307 మీడియం రెజిమెంట్ 
 

లెఫ్టినెంట్  కీషింగ్ క్లిఫ్ఫార్డ్ నంగ్రుం,
మహా వీర్ చక్ర (
మరణానంతరం )
  12 వ బెటాలియన్ జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ  
కెప్టైన్ R జెర్రీ ప్రేమ్ రాజ్ ,
వీర్ చక్ర (
మరణానంతరం ),
158 మీడియం రెజిమెంట్ 

 
 
మేజర్ సోనం వాంగ్ ఛుక్ ,
మహా వీర్ చక్ర
లడఖ్ స్కౌట్స్  


 

యుద్దానికి బయిల్దేరే ముందు రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన  జవానులు, సైన్యాధికార్లు ప్రార్థన చేస్తున్న దృశ్యం.
ముందు రైఫిల్ తో వున్న సైనికుని వెనుక గెడ్డంతో ముఖం కొంతమేర కప్పబడి వున్న వ్యక్తి కెప్టెన్ విజయంత్ తాపర్. ఆయనకు మరణానంతరం వీర చక్ర బిరుదు ఇవ్వబడింది.


 

 టోలోలింగ్ శిఖరాన్ని జయించిన తర్వాత ద్రాస్ సబ్ సెక్టార్ లో వున్న నల్లరాతి నాల్ పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య ( ఆంధ్రప్రదేశ్ ) తన దళాన్ని నడిపిస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో ఆయన 29 జూన్ 1999 న అమరుడయ్యారు. 
ఆయనకు మరణానంతరం పరమ వీర చక్ర పురస్కారం లభించింది.


మన సైనికుల సాహస విన్యాసాలు

శ్రీనగర్ - కార్గిల్ రోడ్ గా పిలువబడే లే - బాతాలిక్ రహదారి అత్యంత ప్రమాదకరమైనది. ఏటవాలుగా ఉండే పర్వత ప్రాంతాలలో ప్రాణాలను పణంగా పెట్టి పహారా కాస్తుంటారు మన జవానులు. ఎల్లప్పుడూ యుద్ధ వాతావరణంతో విశ్రాంతికి, ఆలోచించుకోవడానికి కూడా వారికి చాల స్వల్ప సమయమే దొరుకుతుంది.


 అనునిత్యం ప్రమాదాల అంచున ప్రయాణించే మన వీర జవానులకు ఈ కొండ అంచున వున్న సన్నని రహదారి ఓ లెఖ్ఖా ?
కెప్టెన్ విజయాంత్ థాపర్ ( రాబిన్ )

తన 22 వ ఏట మనందరి భవిష్యత్తుకై ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు 


 


 

తన తల్లిదండ్రులకు విజయాంత్ రాసిన చివరి ఉత్తరం  


  
 


  

 ఆ తర్వాత మువ్వన్నెల జెండా కప్పుకుని ఇంటికి జేరాడుఆనాటి కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన 23 మంది సైనికుల త్యాగం
మరువలేనిది. ఆ బెటాలియన్ భారత దేశంలో అత్యంత ప్రతిష్థాకరమైన మహవీర చక్ర పురస్కారాలు నాలుగు లభించాయి. అందులో మూడు మరణానంతరం అందించారు.
శత్రు సంహారంలో మరణించిన రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన మేజర్ వివేక్ గుప్తా భౌతిక కాయానికి ఆయన భార్య ఆర్మీ మెడికల్ కార్ప్స్ కి చెందిన కెప్టెన్ ( డా. ) రాజశ్రీ గుప్తా సెల్యూట్ చేస్తున్న దృశ్యం.

 
మన రక్షణ కోసం ప్ర్రాణాలను పణంగా పెట్టిన మన వీర జవానులను చూసి మనమంతా గర్వపడాలి 
ముఖ్యంగా భారతీయులమైనందుకు గర్వపడాలి 

Vol. No. 01 Pub. No. 354

4 comments:

A K Sastry said...

లింకులేమీ తెరవబడట్లా!

SRRao said...

కృష్ణశ్రీ గారూ !
ఈ టపాలో నేనేమీ లింకులు ఇవ్వలేదండీ ! ఒకవేళ ఫోటోలు ( 25 ) గానీ తెరుచుకోవడంలేదా ? తెలుపగలరు.

r said...

Sir,
please check your mail
to rectify the mistake
( this comment need not be published
OR can be safely removed )

SRRao said...

r గారూ !
పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు. సరి చేస్తాను.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం