Friday, July 9, 2010
'భట్' రాజీయం
డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి చెప్పగానే మనకి ముందు గుర్తుకొచ్చేది ఆంధ్రాబ్యాంకు. ఆయన దాని వ్యవస్థాపకుడు. తర్వాత కృష్ణా జిల్లాతో, ముఖ్యంగా బందరుతో అనుబంధమున్న వాళ్లకి ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆంధ్రా జాతీయ కళాశాల. దాని వ్యవస్థాపకుల్లో ముఖ్యులు డా. పట్టాభి. ఆయన దేశభక్తుడు, జాతీయవాది.
ఒకసారి ఆయనకు బందరులో సన్మాన సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైంది. ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. సన్మాన సభ అనగానే ఆ సన్మాన స్వీకర్తను పొగడ్తలతో ముంచెత్తడం సర్వసాధారణం. అలాగే ఆ సభలో కూడా పట్టాభిగారి మీద పొగడ్తల వర్షం కురుస్తోంది. ఒక శ్రోత మరీ రెచ్చిపోయి " భోగాన్ని అనుభవించడంలో ఆయన భోగరాజు. దానం చేయడంలో ఆయన దానరాజు, త్యాగశీలత గల త్యాగరాజు..... " అంటూ ఆవేశంగా పొగిడేస్తున్నాడు.
డా. పట్టాభి గారికి పొగడ్తలంటే సుతరామూ గిట్టదు. హద్దులు దాటేస్తున్న పొగడ్తలను భరించలేక లేచి మైక్ అందుకుని
" నా గురించి ఈయన చెప్పింది ఎంతవరకూ నిజమో తెలియదు గానీ, ఈయన మాత్రం నిజంగా ' భట్ ' రాజే ! " అని చమత్కరించారు.
ఇంతకీ అప్పటివరకూ డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిని పొగడ్తలతో ముంచేసిన వక్త పేరు పి.సి.భట్. అదీ సంగతి.
Vol. No. 01 Pub. No. 344
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
My son's Great Grandfather, now 87, says that Pattabhi garu met Sardar Vallabahi Patel and the other two who were a part of the committee in charge of the issue on separate telugu state.
Sardar asked him what was the need to form a separate state on the basis of language. Then Pattabhi pulled out a coin and threw it on the table.
It showed
'one anaa, ek anaa, oka anaa'.
He pointed at it and asked why the value of the coin was written only in telugu and not other South Indian languages. And Sardar couldn't reply.
Madhuri Garu
Thank you very much your for valuable infomation
Post a Comment