కనుక్కోండి చూద్దాం - 21
జవాబులు
జవాబులిచ్చిన వారిలో .....
జ్యోతి గారు రాసిన నలుగురు సంగీత దర్శకుల చిత్రాలు సరైనవే ! కానీ వారిలో శంకర్ జైకిషన్, ఆర్.డి. బర్మన్ లు ఇతర చిత్రాలకు కూడా సంగీతం చేశారు.
మాదురిగారు మొత్తానికి అన్నిటికీ సమాధానాలు సరిగానే రాసినా, కొన్నిటిలో తొందరపడ్డారు. అడవి రాముడు, కొండవీటి సింహం చిత్రాలకు సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ లు కాదు. అలాగే ' రాకీ ' చిత్రానికి సంగీతమందించింది ఆర్. డి. బర్మన్ కాదనుకుంటాను. ఆ చిత్రం గురించి నా దగ్గర సమాచారం లేదు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ విషయంలో నాగార్జున సిద్ధార్థ, నేటి సిద్ధార్థ రెండూ వేర్వేరు చిత్రాలు కాదు. ఒకటే చిత్రం. మొదట ' సిద్ధార్థ ' గా పేరు పెట్టిన ఆ చిత్రానికి తర్వాత ముందు ' నేటి ' అనే పదం కలిపారు. మిగిలిన వారి విషయంలో సరిగానే రాసారు.
సుజాత గారు చెప్పిన ఇద్దరి విషయం సరైనదే !
స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
ఇక జవాబులు -
హిందీలో ప్రముఖులైన కొంతమంది సంగీత దర్శకులు తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ క్రింద ఇచ్చిన సంగీత దర్శకులు ఏయే చిత్రాలకు పని చేసారో చెప్పగలరా ?
1. శంకర్ జైకిషన్ - ప్రేమ లేఖలు, జీవితచక్రం
2. ఆర్. డి. బర్మన్ - చిన్నికృష్ణుడు, అంతం
3. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ - మజ్ను, నేటి సిద్ధార్థ
4. ఓ.పి. నయ్యర్ - నీరాజనం
5. సి. రామచంద్ర - అక్బర్ సలీం అనార్కలి
6. సలీల్ చౌదరి - చైర్మన్ చలమయ్య
Vol. No. 01 Pub. No. 339
5 comments:
రాకీ సినిమా (1987) సంగీతం చేసినది ఆర్.డి.బర్మనే (అట!)
http://www.panchamonline.com/lists/songs/teluguRocky.htm
సి. రామచంద్ర 1958 లో విజయకోట వీరుడు అనే సినిమాకి కూడా (తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీయబడింది) సంగీతం సమకూర్చాడు.
భవదీయుడు, శ్రీనివాస్
* రంజని గారూ !
ముందుగా ధన్యవాదాలు. ' .......అట ' అంటున్నారు. మీకు కూడా ఖచ్చితంగా తెలియదా ? మీరిచ్చిన లింక్ లో సంగీత దర్శకుడి వివరాలు లేవు. ఎవరికైనా తెలిస్తే సరైన సమాచారం ఇవ్వగలరు.
* శ్రీనివాస్ గారూ !
మీ స్పందనకు ధన్యవాదాలు. ఆ చిత్రం పూర్తి స్థాయి తెలుగు చిత్రం కాదనుకుంటాను. ఎందుకంటే పూర్తి స్థాయి ( straight ) తెలుగు చిత్రాల జాబితాలో చోటు చేసుకోలేదు. ఆ చిత్ర వివరాలు మీ దగ్గర వుంటే తెలియపరచగలరు.
"... లింక్ లో సంగీత దర్శకుడి వివరాలు లేవు"
అది ఆర్.డి.బర్మన్ గురించిన వెబ్ సైట్ . అందులో
ఆయన సంగీతం చేసిన సినిమాలలో రాకీ హిందీ చిత్రం తో
పాటు రాకీ తెలుగు చిత్రం కూడా స్పష్టముగా ఇవ్వబడింది.
అలాగే చిమట సైట్ లో , ఇతర ఫోరంలలోనూ ఈ విషయం ఉంది ...
రంజని గారూ !
ధన్యవాదాలు. మీరు ముందు రాసిన వ్యాఖ్యలో చెప్పాక వెదికాను. కానీ చిమట సైటులో ఈ చిత్రం గురించి సమాచారం దొరకలేదు. ఏది ఏమైనా సమాచారమిచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు.
Post a Comment