శ్రీ రహమతుల్లా గారు ' శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రంలోని పాటను జ్ఞప్తికి తెస్తే నా దగ్గరున్న ఆ పాటను అందించాను. సూరిబాబు గారి గాత్రం మీద మక్కువతో ఒక అభిమాని తన వ్యాఖ్యలో ( ' అజ్ఞాత ' పేరుతో రాసారు. వారు తమ పేరు తెలియజేస్తే ఇక్కడ ప్రచురించగలను ) ' దక్ష యజ్ఞం ' లోని ' హర హర మహాదేవ ' పాట లింక్ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ మంచి పాట, గాత్రం, అభినయం అందరి కోసం........
ఈ పాటతో బాటు ' దక్ష యజ్ఞం ' చిత్రంలోనివే సూరిబాబు, రఘురామయ్య, మాధవపెద్ది పాడిన పద్యాలు కూడా చూడండి.
Vol. No. 01 Pub. No.321
8 comments:
సూరిబాబు గారు పాడిన "హరిశచంద్ర (SVR)" లో పద్యాలు కూడా బావుంటాయండీ.
మాలపిల్లలో "కొల్లాయికడితేనేమి మా గాంధి" అనే పాట కూడా సూరిబాబుగారు పాడినదే అనుకుంటాను, మంచిపాట.
సౌమ్య గారూ !
'మాలపిల్ల' లో పాట సూరిబాబు గారిదేనండీ ! ఈ పాట old telugu songs సైట్లో వుంది. హరిశ్చంద్ర పద్యాలు మాత్రం దొరకలేదు. ఏమైనా గతతరం మేటి కళాకారుల్ని మరచిపోకుండా గుర్తుచేసుకోవడం బావుంది. ధన్యవాదాలు.
హరిశచంద్ర పద్యాలు నా దగ్గర కేసట్లో ఉన్నాయి. CD లొ ఉన్నయో లేవో వెతకాలి. దొరికితే తప్పకుండ మీ అందరితో పంచుకుంటాను.
సౌమ్య గారూ !
కేసెట్లో ఉన్నాయంటున్నారు కనుక సీడీలోకి మార్చెయ్యండి, మీ దగ్గర రికార్డింగ్ సాఫ్ట్వేర్ వుంటే ! లేకపోతే చెప్పండి. వివరాలు చెబుతాను.
నాకు అంతగా వీటి గురించి తెలీదండి. చెప్పండి, మార్చే ప్రయత్నం చేస్తాను.
సౌమ్య గారూ !
1. మీ దగ్గర nero full version ఉన్నట్లయితే అందులో wave editor వుంటుంది. అది లేకపోతే ఈ కింది లింక్ లో wavepad sound editor అనే software ను డౌన్లోడ్ చేసుకుని install చేసుకోండి.
http://www.nch.com.au/wavepad/index.html
2 . మీ టేప్ రికార్డర్ line out నుంచి గానీ ear phone socket నుంచి గానీ సిస్టం కు వున్న line in కి E.P. తో E.P. కేబుల్ తో కలపండి.
౩. ఇప్పుడు software open చేసి టేప్ రికార్డర్ play చేసి software లో రికార్డు బటన్ నొక్కండి. పాట రికార్డు అవుతున్నట్లు wave form కనబడుతుంది. తర్వాత సేవ్ చేసుకోండి.
క్లియర్ గానే చెప్పాననుకుంటాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే నాకు నిరభ్యంతరంగా మెయిల్ చెయ్యొచ్చు. మీరందించే 'హరిశ్చంద్ర ' పద్యాలకోసం ఎదురు చూస్తూ....
రావు గారూ చాలా థాంక్సండీ.
కొంచం అర్థమయినట్టే ఉంది. ప్రయత్నిస్తాను. సందేహాలుంటే మరల మిమ్మల్ని అడుగుతను.
త్వరలో మీకు పద్యాలందిస్తాను.
Thank you!
Post a Comment