పి.వి. నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పటి రోజులు. ఉపాధ్యక్షరాలిగా శ్రీమతి నజ్మా హెప్తుల్లా వున్న రాజ్య సభలో ప్రశ్నోత్తరాల సమయం. ప్రధానికి ప్రశ్న వేశారు. కానీ ఆ సమయానికి ఆయన సభలో లేరు. ప్రతిపక్ష సభ్యులు తమ అభ్యంతరాన్ని ఉపాధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్ళారు. సరిగ్గా ఆ సమయంలోనే పి. వి. సభలో ప్రవేశించారు.
ఆయన్ని చూసి నజ్మా హెప్తుల్లా " ప్రధాని గారూ ! మీరంటే సభ్యులకు ఎంత ప్రేమో చెప్పలేం ! మీరు రావడం ఒక్క నిముషం ఆలస్యమైనా తాళలేకపొతున్నారు " అన్నారు.
వెంటనే పి.వి. నరసింహారావు గారు నవ్వుతూ " అయ్యో ! ఈ విషయం ముందే తెలిస్తే మరికొంచెం ఆలస్యంగా వచ్చేవాడిని. అప్పుడు సభ్యులు విరహ వేదనతో మరింత ప్రేమ కురిపించేసి ఉండేవాళ్ళు కదా ? " అని ఛలోక్తి విసిరారు.
Vol. No. 01 Pub. No.307
2 comments:
SRRao Garu,
This time you touched Sri P.V. Narasimha Rao a great personality of India.
Every one has utilised him and thrown away. He lead the minority Govt. successfully for full time. Because of others, he has been eliminated.
Really I hate politics.
మధుకరరావు గారూ !
ధన్యవాదాలు. మీరు రాసినవి అన్నీ నిజాలే ! కానీ మనం సగటు మానవులం. భరిస్తూ, తిట్టుకుంటూ వుండడం తప్ప ఏమీ చెయ్యలేం.
Post a Comment