తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్ర ఘనమైనది. కృష్ణుణ్ణీ, రాముణ్ణీ తలుచుకోగానే మన కళ్ళముందు ఎన్టీయార్ రూపం ప్రత్యక్షమైనట్లు రావణుడు, ధుర్యోధనుడు, యమధర్మరాజు లాంటి పాత్రలకు ఎస్వీరంగారావు రూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అసలు వాళ్ళు ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసారేమోననిపిస్తుంది.
1957 లో కడారు నాగభూషణం దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సత్యవంతునిగా, ఎస్. వరలక్ష్మి సావిత్రిగా వచ్చిన ' సతీసావిత్రి ' చిత్రంలో యముడిగా ఎస్.వి. రంగారావు నటించారు. ఆ చిత్రం జెమినీ స్టూడియోలో నిర్మించబడింది.
అప్పట్లో చైనా ప్రధానిగా వున్న చౌ-ఎన్-లై ఆ సమయంలోనే మద్రాసు సందర్శించారు. అందులో భాగంగా ఆయన జెమినీ స్టూడియోకు కూడా వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ' సతీసావిత్రి ' షూటింగ్ జరుగుతోంది. ఎస్. వి. రంగారావు గారు యముడి గెటప్ లో వున్నారు. చౌ-ఎన్-లై కి ఆ ఆహార్యం ఆసక్తి కలిగించింది. వివరాలడిగారు. జెమినీ స్టూడియో అధినేత ఎస్.ఎస్.వాసన్ ఆయనకు ఎస్. వి. రంగారావుని పరిచయం చేస్తూ " ఈయన గ్రేట్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఈయన వేసినది ఆయువు మూడినపుడు మనుష్యుల ప్రాణాలు హరించే దేవుడి వేషం " అని వివరించారు.
దానికి చౌ-ఎన్-లై ఆశ్చర్యంగా " మీ దేశంలో ప్రాణాలు తియ్యడానికి కూడా ఓ దేవుడున్నాడా ? " అంటూ ఎస్వీఆర్ కి అభినందనలు తెలుపుతూ " నన్ను మాత్రం కొంతకాలం ఈ భూమ్మీద వుండనివ్వండి " అని నవ్వుతూ చమత్కరించారు.

Vol. No. 01 Pub. No. 317
3 comments:
good info sir
What is speciality/greatness of that China draconian politician?
A boul of boiled frog-legs would have made impressed him more! :P
* లక్ష్మీనారాయణ సునీల్ గారూ !
ధన్యవాదాలు
* అజ్ఞాత గారూ !
అంత పెద్ద దేశానికి ప్రధాని కావడం ప్రత్యేకత అయితే మన దేవుడి వేషానికి ఆ మహానటుడ్ని ప్రశంసించడం గొప్పతనం అని నేననుకుంటున్నాను. ఏమైనా మీ స్పందనకు మాత్రం ధన్యవాదాలు.
Post a Comment