కనుక్కోండి చూద్దాం ! - 17
ఈ ప్రక్క ఫోటోలోని వ్యక్తి భారత చిత్రసీమలో పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి.
ఎవరో గుర్తు పట్టగలరా ?
జవాబు :
పై ప్రశ్నకు జ్యోతి గారొకరే సరైన సమాధానం చెప్పారు. అసలు సమాధానమిచ్చింది కూడా ఆవిడొకరే ! ఆవిడకు ధన్యవాదాలు.
ఇది జేసుదాసు గా పిలవబడే జే. యేసుదాసు గారి గెడ్డంతో లేని ఫోటో. ఇప్పుడు మనమంతా చూసే యేసుదాసు గారి గెడ్డం వెనుక కథ ఏమిటంటే ....................
జేసుదాసు గారికి పెళ్ళైన ఏడేళ్లకు ఆయన భార్య గర్భం దాల్చింది. ఆ సమయంలో దీక్ష పడితే మంచిదని పెద్దలు సలహా ఇచ్చారు. వారి సలహాననుసరించి జేసుదాసు దీక్ష తీసుకుని గెడ్డం పెంచడం ప్రారంభించారు. కొందరు మిత్రులు ఆది చూసి ఆయన ముఖానికి గెడ్డం బాగా అమిరిందని మెచ్చుకున్నారు. మిత్రులే కాదు భార్య కూడా ఆయన గెడ్డాన్ని మెచ్చుకుంది. దాంతో ఇక ఎప్పటికీ గెడ్డం తియ్యకూడదని జేసుదాసు నిర్ణయించుకున్నారు. అప్పట్నుంచీ మనకు జేసుదాసుకు గుర్తుగా గెడ్డం ఉండిపోయింది. గెడ్డం పెంచకముందు జేసుదాసు ఫోటోగా ఇప్పుడు బాగా గుర్తించగలరనుకుంటాను.
Vol. No. 01 Pub. No. 314
2 comments:
You should have asked...'who is this singer?'
మాధురి గారూ !
దీన్ని బట్టి మీరు సమాధానం కోసం ఎంత ఆలోచించారో అర్థమవుతోంది.అంత దగ్గర క్లూ ఇచ్చేస్తే అలోచించడంలో థ్రిల్ ఉంటుందంటారా ? అసలు ఫోటోయే పెద్ద క్లూ కదా !
Post a Comment