Thursday, June 17, 2010

' నేను ' - మీ కోసం

' నేను ' అనే ఈ లఘు చిత్రం విజువల్ కమ్యూనికేషన్స్ ( బి.ఎస్సీ. ) మొదటి సంవత్సరం పూర్తిచేసి రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన మా అబ్బాయి ఉదయ్ తన మిత్ర బృందంతో కలసి నిర్మించాడు. ఆ బృందంలోని అందరి వయసూ దాదాపుగా 18 సంవత్సరాలే ! ఇప్పుడిప్పుడే లోకాన్ని అర్థం చేసుకుంటున్న పిల్లలు వీళ్ళు. వాళ్ళకు పాఠాలు నేర్పిస్తూ ప్రోత్సహిస్తున్న తమ ఫేకల్టీ వి గానీ, సుమారు 25 సంవత్సరాల అనుభవమున్న నావి గానీ సలహాలు, సూచనలు తీసుకోకుండా పూర్తిగా తామే స్వంతంగా నిర్మించిన ఈ చిన్న సినిమా వారికి తొలి అడుగు. అది తప్పటడుగో, తప్పుటడుగో మిత్రులు, పెద్దలు చెప్పాలి. వాళ్ళు చదువుతున్నది విజువల్ కమ్యూనికేషన్స్. సమాజంలోని అనేక కోణాలను, అనేక సమస్యలను అందరికీ అర్థమయ్యే విధంగా దృశ్య రూపంలో అందించాల్సిన బాధ్యత కలిగిన వృత్తులలోకి భవిష్యత్తులో ప్రవేశించాల్సిన వాళ్ళు. మీ అందరి అభిప్రాయాలు, విమర్శలు, సలహాలు, సూచనలు వారి భవితకు సోపానాలు కాగలవనే వుద్దే్శ్యంతో ఈ చిన్ని చిత్రాన్ని మీ అందరి ముందు పెడుతున్నాను. అందుకే ఈ చిత్రం చూసాక ఉదాసీనంగా వెళ్ళిపోక మీకు కనిపించిన లోపాలు, మెరుగు పరచుకోవడానికి మీరిచ్చే సూచనలు మిత్రులందరూ దయచేసి నిర్మొహమాటంగా తెలియజేస్తారని ఆశిస్తూ.... అవే వాళ్ళకు దీవెనలు కావాలని కోరుకుంటూ...........మీకోసం... మీ ఆశీస్సులకోసం.....   
       
  నేను  
























Vol. No. 01 Pub. No. 324

7 comments:

జయ said...

బాగుందండి. వాళ్ళభావాలను వాళ్ళే తెలియచెప్పాలనుకున్నారేమొ. అందుకే ఎవరి సలహా తీసుకొలేదు. చక్కగానే వ్యక్తీకరించారు. ఈ రోజుల్లో యువత తమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినా ఇంకా ఈ మార్పు రావాల్సిన పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంది. అటువంటివారికి ఇది ఉపయోగపడుతుంది. ముందు ముందు ఇంకా మంచి చిత్రాలు వీళ్ళు చేయగలరు. వీరందరికీ నా అభినందనలు అందజేయండి.

Vinay Datta said...

Please convey my hearty congratulations to the entire team. Lakshmi's voice is very clear. Please ask the last guy in the film to focus more on clarity and then on diction. But everybody is good looking.

Also let us know who your son is, among the team. It would be more interesting if the team can put their experiences in their own words, from the choice of the topic till the submission.

ranjani said...

ఈ చిత్రాన్ని నవతరంగం , షార్ట్జ్ ... వంటి సైట్లకి సమీక్షకి పంపించారా ...

SRRao said...

* జయ గారూ !
ఈమధ్య బిజీగా వున్నారనుకుంటాను. కొంతకాలంగా మీ టపాలు, వాటిని మించిన విశ్లేషాత్మక వ్యాఖ్యలు లేక బ్లాగు లోకం చిన్నబోయింది. మీ అభినందనలు వీళ్ళకి శుభాశీస్సులు. అందచేసాను. మీకు ధన్యవాదాలు.

* మాధురి గారూ !
మీరన్న 'last guy in the film ' మా అబ్బాయే ! Story, dialogues , camera and direction వాడే ! ( 10 క్లాసు చదివే రోజుల్లో సెలవల్లో నాతో బాటు షూటింగ్ కి వచ్చేవాడు లెండి ). నిజానికి అది చివర్న కలిపారు. ఎందుకని అడిగితే అందులో కొంత clarity miss అయినట్లనిపించి అలా కలిపామన్నారు. నిజానికి మొదటిసారి చూసినపుడు నా అభిప్రాయం కూడా అదే ! ఇంకా నా దృష్టిలో కొన్ని ప్రధాన లోపాలున్నా వాళ్ళ స్థాయికి దిగి ఆలోచిస్తే అందులోను మొదటి ప్రయత్నం, ఇంకా పూర్తి అనుభవం, పరిజ్ఞానం రాని వాళ్ళ ప్రయత్నం కావడం వాళ్లకి లోపాలు నేరుగా చెప్పి నిరాశ పరచడం మంచిది కాదనిపించింది. మీవంటి మిత్రులు చూసి మంచిచెడ్డలు చెబితే వాళ్లకి భవిష్యత్తులో ఉపయోగపడతాయనిపించింది. మీరడిగిన విషయాన్ని వాళ్లకి చెప్పాను. వాళ్ళ అనుభవాలను వాళ్ళనే రాయమన్నాను. మీ అభినందనలు వాళ్లకి అందించాను. ధన్యవాదాలు.

* రంజని గారూ !
లేదండి. ఆ సైట్లకి సమీక్షకి పంపే స్థాయిలో లేదేమోననుకుంటున్నాను. మిత్రుల అభిప్రాయాలు, సలహాలు,సూచనలు, ఆశీస్సులు వాళ్ళను ఆ స్థాయికి చేరుస్తుందనే ఉద్దేశ్యంతో నా బ్లాగ్లో మాత్రం పెట్టాను. వాళ్ళు you tube లో పెట్టుకున్నారు. మీ సూచనకు ధన్యవాదాలు.

Vinay Datta said...

When I saw the film I got a feeling that your son must have been the key person of the film. I also felt the film was shot at your home. Am I right? I noticed the picture of an elderly, traditional woman in the film.

SRRao said...

మాధురి గారూ !
మీ సునిశిత పరిశీలనకు జోహార్లు. అయితే మా ఇంట్లో shoot చెయ్యలేదండీ ! నా ఎదురుగా చెయ్యడానికి ఫీల్ అయ్యాడేమో, వైజాగ్ ఫ్రెండ్స్ తో వెళ్లి మా అత్తగారింట్లో చేసాడు. మీ పరిశీలనా దృష్టి అమోఘం. ఆ దృష్టితో చూసి, ముఖ్యంగా కాన్సెప్ట్ మీద మీ విశ్లేషాత్మక వ్యాఖ్య రాయొచ్చు కదా !

Vinay Datta said...

thanks for the encouraging words.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం