కనుక్కోండి చూద్దాం - 19
సంగీత విద్వాంసులెవరు ? - జవాబు
ఈ ప్రశ్నకు జవాబిచ్చిన వారిలో ........
* KK గారు, జయ గారు, అజ్ఞాత గారు కొంతవరకూ సరైన జవాబులిచ్చారు.
* శ్రీనివాస్ పరుచూరి గారు, మాధురి గారు సరైన సమాదానాలిచ్చినా మాధురి గారు కొంచెం ఆలస్యమయ్యారు. అయితే రంజని గారన్నట్లు తెలుగు పాటల నిధి సేకరణలో భాగస్వాములైన శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత మిగిలిన వాళ్లకు ఆలోచించే అవకాశముండదు. ఎందుకంటే ఆయన దగ్గర పెద్ద data bank వుంది. మిగిలిన మిత్రులు జవాబుల కోసం Old Telugu Songs ను కూడా పరిశీలించే అవకాశముంది. శ్రీనివాస్ గారు ఈ విషయం గమనిస్తారనుకుంటాను.
............ అందరికీ ధన్యవాదాలు.
ఇక జవాబులు -
1 . పవిత్రహృదయాలు ( 1971 ) - ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చినసత్యనారాయణ గార్లు.
2. బికారి రాముడు ( 1961 ) - ఆకాశవాణి ద్వారా శాస్త్రీయ, లలిత సంగీత గాయనిగా చిరపరిచుతులైన శ్రీరంగం గోపాలరత్నం గారు
3. సతీ సావిత్రి ( 1957 ) - మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్. వరలక్ష్మి గార్లు
ఈ పాట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన తొలి సినిమా పాట. ఆయనే స్వరకర్త కూడా ( ఎస్. రాజేశ్వరరావు కూడా ఈ చిత్రానికి సంగీతమందించారు )
ఈ చిత్రంలో పువ్వుల సూరిబాబు గారు మధురంగా గానం చేసిన అన్నమాచార్య కీర్తన వినండి.
Vol. No. 01 Pub. No. 327
7 comments:
అను మాలిక్ పేరుతో ఇద్దరు సంగీత దర్శకులు ఉన్నారా!
బహుశా పైన ఇచ్చిన సమాచారంలో సవరణ అవసరం..
అను మాలిక్ గా అందరికీ తెలిసిన సంగీత దర్శకుల గురించిన వికీపీడియా వ్యాసం ఇది :
http://en.wikipedia.org/wiki/Anu_Malik
For your kind information, I could clearly recognise the voices of the artists but only tried to search for the other information.I know Nookala garu and Balamurali garu very well and heard a lot of Srirangam.
But I waited for the other related information. Unfortunately I couldn't get the names of the movies from 'paatha telugu paatalu' of 'telugu-kaburlu'. I donot know if they have those songs. As they have songs of the films till '60, there's no chance of getting the information of the first song.
From now onwards, I'll hurriedly give the known information, then update it after getting the related information.
* రంజని గారూ !
అనుకోకుండా దొర్లిన ( సంబంధం లేని ) పొరబాటును నా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు. సవరణ చేసాను.
మాధురి గారూ !
మీ ఆసక్తికి సంతోషం. All the best. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. నాకు తెలియని విషయాలెన్నో మీకందరికీ తెలిసి వుంటాయి. ఈ క్విజ్ ఎవరినీ పరీక్షించడానికి కాదు. సరదాగా ప్రారంభించినా మన జ్ఞాపకాల్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి ఉపయోగపడుతోందనిపిస్తోంది.
Please take it easy. I was just kidding. It's interesting to find out answers for the questions you post because Iam a die hard fan of B&W movies, even the movies made prior to the birth of my parents. ( Ofcourse, people ridicule me for that. )We might not remember the contents of a book after reading it. But we remember the information we search out of our own interest.
మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment