తెలుగు సోదరా
గెలుపు నీదిరా !
చూడరా చూడరా తెలుగు సోదరా
నీ చుట్టూరా సాగుతున్న నాటకాలు చూడరా !
................ అంటూ హెచ్చరించినా
ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా.... చావండి !
నెత్తురు నిండే శక్తులు మండే సైనికులారా....... రారండి !
మరో ప్రపంచం మరోప్రపంచం పిలిచింది
పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి
....................అంటూ ప్రభోదించినా
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వసృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విప్పి అరిచాను
నేను సైతం విప్లవాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను
................. అంటూ త్యాగాన్ని వివరించినా
పాడవోయి భారతీయుడా !
ఆడి పాడవోయి విజయ గీతికా !
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటు
...................అంటూ కర్తవ్య బోధ చేసినా
ప్రళయ భయంకర రూపం దాల్చే సీతారామరాజు
పాశుపతాస్త్ర శాపం దాల్చే సీతారామరాజు
మధ్యందిన మార్తాండునివోలె బయిలుదేరినాడు
..................అంటూ అల్లూరి సీతారామరాజు ప్రతాపాన్ని వర్ణించినా
తెలుగువారు నవజీవన నిర్మాతలని
తెలుగుజాతి సకలావనికే జ్యోతి అని
కలసి పాడుదాం తెలుగు పాట
.................. అంటూ తెలుగు జాతి వైభవాన్ని ఎలుగెత్తి చాటినా
ఏనాటికైనా స్వార్థము నశించి తీరును
ఏరోజుకైన సత్యమే జయించి తీరును
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకు గొంకు లేక ముందు సాగి పోమ్మురా
................. అంటూ ధైర్యం చెప్పినా
ఒకటే జాతి ఒకటే నీతి చీలికలేందుకు మనలో
ఒకటే ధ్యేయం ఒకటే శపథం తప్పదు సమరావనిలో
రండీ కదలిరండీ ! రండీ కలసి రండీ !
............... అంటూ సమైక్యతా నినాదం వినిపించినా
అర్థరాత్రి స్వతంత్ర్యం అంధకార బంధురం
అంగాంగం దోపిడైన కన్నతల్లి జీవితం
ఇదే ఇదే నేటి భారతం భరతమాత జీవితం
................. అంటూ భారతమాత దుస్థితిని మన కళ్ళ ముందుంచినా
మారలేదులే ఈ కాలం మారలేదులే ఈ లోకం
దీనులకు హీనులకు తీరలేదులే ఈ శోకం
................ అంటూ దళితుల పరిస్థితిని వివరించినా
పచ్చ పచ్చని బతుకు బంజరై మిగిలింది
దేశమంతా ఈనాడు శోకమే మిగిలింది
ఎన్నాళ్ళూ ఎన్నేళ్ళూ ఈ పాట్లు పడతావూ
ఇకనైనా మేలుకో నీరాజ్యం ఏలుకో
................ అంటూ దారి చూపినా
కండలు కరిగిస్తే పండని చేను ఉంటుందా ?
ముందుకు అడుగేస్తే అందని గమ్యం ఉంటుందా ?
........................అంటూ జీవిత సత్యాన్ని ఆవిష్కరించినా
కళలన్నా కవితలన్నా వీళ్ళకి చుక్కెదురు
కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు
కొంతమంది యువకులు ముందు యుగం దూతలు
............... అంటూ బాద్యత మరచిన యువతరాన్ని హెచ్చరించినా
ఆది మహాకవి శ్రీశ్రీ కే చెల్లు. అన్యాయాన్ని, అక్రమాన్నీ నిర్భయంగా నిలదీయగల సత్తా ఆయనది.
ఆ మహాకవి వర్థంతి సందర్భంగా శిరాకదంబం స్వర నీరాజనం.......................
Vol. No. 01 Pub. No.322
4 comments:
excellent sir.........gud collection
వినయ్ చక్రవర్తి గారూ !
ధన్యవాదాలు
రావు గారు, శ్రీశ్రీ గారి రచనలను అద్భుతంగా సమీకరించారు. చాల బాగుంది ఈ రూపకం. బలిపీఠంలోని పాట సాహిత్యంలో రెండవ పంక్తిలో చిన్న "అప్పు తచ్చు" (అచ్చు తప్పు) ఉంది. "తెలుగు జాతి సకలవానికే" కు బదులు "తెలుగు జాతి సకలావనికే" అని వుండాలి.
* సూర్యనారాయణ గారూ !
చాలా చాలా ధన్యవాదాలు.... అచ్చుతప్పును గమనించడమే కాకుండా నాకు సూచించి సవరించుకునే అవకాశం ఇచ్చినందుకు.
Post a Comment