పువ్వుల సూరిబాబు గారు ప్రముఖ రంగస్థల నటుడు. సూరిబాబు అనేక పౌరాణిక నాటకాల్లో నటించారు. అంతేకాక మాలపిల్ల (1938), రైతు బిడ్డ (1939), తారా శశాంకం (1941), శ్రీకృష్ణ తులాభారం (1955), సతీ సావిత్రి (1957), కృష్ణ లీలలు (1959), శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960), దక్షయజ్ఞం (1962) వంటి కొన్ని చిత్రాల్లో నటించడమే కాక కొన్ని చిత్రాల్లో పాటలు కూడా పాడారు.
ఆయనది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ' శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రంలో ఆయన పాడిన పాటను తెలుగు భాషోద్యమానికి కృషి చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా గారు తమ వ్యాఖ్యలో గుర్తుచేశారు...............
Nrahamthulla said...
రావు గారూ
కొత్త విషయాలు తెలియజేస్తున్నారు.చాలా సంతోషం.నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ నటించిన "వేంకటేశ్వర మహత్యం" సినిమా చూశాను.అందులో నారదుడిగా నటించిన పి.సూరిబాబు వెంకటేశ్వరుని విగ్రహం ముందు నిలబడి"కళ్ళుతెరవరా నరుడా" అనే పాట అద్భుతంగా పాడుతాడు.ఆ పాట దొరుకుతుందేమో అని చాలా చోట్ల ప్రయత్నించాను.సినిమాలో పాటలు ఎక్కువయ్యాయని ఈ పాటను తీసేశారని కొందరు చెప్పారు.విఏకే రంగారావు గారి దగ్గరకూడా ఈ పాట లేదు.ఇలాంటి పాటలను ఎక్కడో ఒకచోట భద్రపరచాలిగానీ పూర్తిగా తీసెయ్యటం వలన అమూల్యమైన తెలుగు సినీ సాహిత్యం,సంగీతం ఎవరికీ దొరకకుండా పోతోందని నా బాధ.
.............. ఇదీ రహమతుల్లా గారి వ్యాఖ్య. కొంతకాలం క్రితం వరకూ ఈ పాట ఆకాశవాణిలో తరచుగా వినిపించేది. నా దగ్గరున్న ఆ పాట ఆయన కోసం, అందరి కోసం...........
ఆయనది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ' శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రంలో ఆయన పాడిన పాటను తెలుగు భాషోద్యమానికి కృషి చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా గారు తమ వ్యాఖ్యలో గుర్తుచేశారు...............
Nrahamthulla said...
రావు గారూ
కొత్త విషయాలు తెలియజేస్తున్నారు.చాలా సంతోషం.నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ నటించిన "వేంకటేశ్వర మహత్యం" సినిమా చూశాను.అందులో నారదుడిగా నటించిన పి.సూరిబాబు వెంకటేశ్వరుని విగ్రహం ముందు నిలబడి"కళ్ళుతెరవరా నరుడా" అనే పాట అద్భుతంగా పాడుతాడు.ఆ పాట దొరుకుతుందేమో అని చాలా చోట్ల ప్రయత్నించాను.సినిమాలో పాటలు ఎక్కువయ్యాయని ఈ పాటను తీసేశారని కొందరు చెప్పారు.విఏకే రంగారావు గారి దగ్గరకూడా ఈ పాట లేదు.ఇలాంటి పాటలను ఎక్కడో ఒకచోట భద్రపరచాలిగానీ పూర్తిగా తీసెయ్యటం వలన అమూల్యమైన తెలుగు సినీ సాహిత్యం,సంగీతం ఎవరికీ దొరకకుండా పోతోందని నా బాధ.
.............. ఇదీ రహమతుల్లా గారి వ్యాఖ్య. కొంతకాలం క్రితం వరకూ ఈ పాట ఆకాశవాణిలో తరచుగా వినిపించేది. నా దగ్గరున్న ఆ పాట ఆయన కోసం, అందరి కోసం...........
Vol. No. 01 Pub. No.320
17 comments:
రావు గారూ, ధన్యవాదాలు.
రావుగారూ
భగవంతుడు ఎవరిని ఎందుకు పరిచయం చేస్తాడోగదా? నాకు ఈ పాట మీద్వారా దొరికింది.మళ్ళీ నా బాల్యం లోకి పంపారు.ఎంతమంచిపాటండీ.ఈ పాటను నేను డౌన్ లోడ్ చేసుకోవటం ఎలాగో తెలియదు.దీనిని ఎంపీ౩ ఫైల్ గా నాకు మైల్ చేయగలరా?
ఈ పాటను ఓల్డ్ తెలుగు స్సాంగ్స్ గ్రూప్ లో కూదా ఉంచండి.ధన్యవాదాలు.
కళ్ళు తెరువరా నరుడా
నీ ఖర్మ తెలియరా [[కళ్ళు]]
కలిమిలేములకు కష్టసుఖాలకు
కారణమొకటేరా నీ ఖర్మే మూలమురా[[కళ్ళు]]
వేపనువిత్తి ద్రాక్షకోసమై
వేడుక పడుట వెర్రికదా
కాలికి రాయి తగులుటకన్న
రాయికి కాలే తగులునురా [[కళ్ళు]]
కమలనాభుని పదకమలములే
కలుష జలధికీ సేతువురా
కలిమాయలలో కలతజెందినా
ధరణికి అదియే తారకమగురా [[కళ్ళు]]
* శంకరయ్య గారూ !
ధన్యవాదాలు.
* రహమతుల్లా గారూ !
మీ అభిమానానికి కృతజ్ఞతలు. నా దగ్గర ఆ పాట వున్నది కనుక అందించగలిగాను. అలాగే మీకు మెయిల్ లో కూడా పంపాను. ఓల్డ్ తెలుగు సాంగ్స్ లో ఉంచడానికి ప్రయత్నిస్తాను.
Great voice! This is another gem from Suri babu.
http://www.youtube.com/watch?v=M6B2LmGuH1Q
Great Rare song by Suribabu.
I think the song is tuned in
Raga Keeravani ?? Can some music lover clarify?
రావుగారూ
పాట పంపినందుకు కృతజ్నతలు . సూరిబాబు,రఘురామయ్య,ఎ.వి.సుబ్బారావు మన తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యాలు.వారు పాడిన పాడిన పాటలు పద్యాలు ఓల్డ్ తెలుగు సాంగ్స్ గ్రూప్ లో లేనివి మీ వద్ద ఏమైనా ఉంటే వెలుగులోకి తెండి.
* అజ్ఞాత గారూ !
మీరిచ్చిన లింక్ కు ధన్యవాదాలు. ఆ లింక్, అదే చిత్రంలోని పద్యాల లింక్ తో కొత్త టపా ఇచ్చాను, అందరూ చూసి ఆనందిస్తారని. ఇంట మంచి లింక్ ఇచ్చిన మీరు దయచేసి మీ పేరు తెలియజేసినట్లయితే చాలా ఆనందిస్తాను.
* రాజ్ పెద్ది గారూ !
ధన్యవాదాలు. మీ సందేహం సంగీత జ్ఞానం గల వారెవరైనా తీరుస్తారేమో చూద్దాం.
* రహమతుల్లా గారూ !
ధన్యవాదాలు. మీరడిగినట్లు నా దగ్గరున్నంత వరకూ తప్పకుండా అందజేస్తాను.
అద్భుతమైన సాహిత్యం. చాలా బాగా పాడారు కూడా..రావుగారు..ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు అందిస్తున్న మీకు హౄదయపూర్వక ధన్యవాదములు.
ఆమ్రపాలి
రహమతుల్లా గారు,
నేను 3-4 ఏళ్ళ క్రితం Oldtelugusongs గ్రూపులో మీకిచ్చిన జవాబులో ఆ పాట రంగారావు గారి దగ్గర లేదని అనలేదు. ఆయన చేసిన 75 (60+15) నిమిషాల సంకలనంలో చేర్చలేదు అన్నాను. ఆ మాటకొస్తే ఆయన మరొక పాటకూడా వదిలేశారు.
ఆ పాట (మట్టి) రికార్డు చాలామంది దగ్గరుంది (నా దగ్గర కూడా). నాకు పాటల్ని digitize చేసే పరిజ్ఞానం, సమయం లేదు. అది వేరే విషయం అనుకోండి.
భవదీయుడు,
శ్రీనివాస్
* ఆమ్రపాలి గారూ !
ధన్యవాదాలు
* శ్రీనివాస్ గారూ !
రహమతుల్లా గారి, సూరిబాబు గారి పుణ్యమాని మీరు నా శిరాకదంబం సందర్శించినందుకు కృతజ్ఞతలు. మీ old telugu songs సైట్ ద్వారా ఎన్నో పాత పాటల్ని వెలుగులోకి తెస్తున్న మీకు అభినందనలు.
శ్రీనివాస్ గారూ,రావుగారూ
అప్పట్లో నేనే రంగారావుగారిని ఈ పాట కావాలని అడిగాను.అది దొరక్కపోవచ్చు అన్నారు.అందుకే అలా రాశాను.ఇప్పుడు మీరిచ్చిన సమాచారం ప్రకారం మట్టిరికార్డులు చాలామంది దగ్గరున్నాయి.అయితే ఇలాంటి అపురూపమైన పాటలదృశ్యాలు పునరుధ్ధరణ కోసం ఎక్కడైనా దొరకొచ్చా?అవి పూర్తిగా పోయినట్లేనా?
మట్టి రికార్డులను డిజిటైజ్ చేసే పరిజ్నానం ఏ సంస్థ దగ్గర ఉంది?
పి. సూరిబాబు పాడిన కొన్ని పాటలు, పద్యాలు : oldtelugusongsలో లేనివాటిని మాత్రం మట్టి రికార్డుల్లో ఉన్నా దయచేసి బయట పెట్టాలని మనవి.
కనకతార - 1937
*అఙ్ఞనంబున ఆశలు
*వారే చరితార్దులు ఆత్మను
*ఏల ఈ పగిది పనికిమాలిన
*దయారహితమీ దుర్విధి
*దేవుని మహిమ తెలియగ
మాలపిల్ల - 1938
*మనుజుల విభజన మేలా
*లేరా లేరా నిదుర మానరా
*కొల్లాయిగట్టితే యేమి మా గాంధి
*మాలలు మాత్రం మనుజులు కారా?
*లేవు పేరునకెన్నియో మతము
*జైజై మహాదేవా పాపపరిహారా
రైతుబిడ్డ (1939)
*రైతు పైన అనురాగము చూపని
*కన్నబిడ్డకై కళవళ పడుచును కన్నీరు కార్చును
*సై సై ఇదేనా భారతీ నీ పేరే (బుర్రకధ)
*సుక్షేత్రములు దయాసూనులై పీడించు (పద్యం)
*రైతుకే ఓటివ్వవలెనన్నా నీ కష్టసుఖముల
ఇల్లాలు 1940
*నీ మహిమేమో నేరగలేమె -
*సరోజినిదళ గతజలబిందువు చపలము సుమ్మి
హరిశ్చంద్ర – 1956
*తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్నమున్ బాయనీ (పద్యం)
*శిరమెల్లగొరగించుకొనుచు స్వతపక్షీలముల మాని సాటి (పద్యం)
మహాకవి కాళిదాసు – 1960
*అభిఙ్ఞాన శాకుంతలం ( నాటకం)
*రామపదాభ్య భక్తుడవు రామచరిత్ర శిలాక్షరముగా (పద్యం)
*రాజనీతిని లోకరక్షగా రూపించ రఘువంశ కావ్యంబు రచనచేసి (పద్యం)
శ్రీ కృష్ణరాయబారం – 1960
*అనికిన్ దోడపడమంచు పోరతగడే ఆచార్యుడు ఈ సూతనందనుడా (పద్యం)
*కచ్చియమాన్పి కౌరవులకాతు తలంపున సంధి చేయగా (పద్యం)
*మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు రండంచు (పద్యం)
*విలయంబోదాంభుధారా విశరమ్మువలెన్ ఉర్వి (పద్యం)
శ్రీ వెంకటేశ్వర మహత్యం – 1960
*అన్యులెదుటన తన నాధుడుడవమచేత సైపజాలునే (పద్యం)
*ఈశ్రీనివాసుండు ఏడుకొండలపైన కలియుగ దైవమై (పద్యం)
*ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రముల (పద్యం)
ఉషాపరిణయం – 1961
*ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం)
*బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం )
*మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు)
*సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా
రహమతుల్లా గారూ !
' మాలపిల్ల ' పాటలు old telugu songs లో వున్నాయి. మిగిలిన వాటిల్లో కొన్ని నా దగ్గర కాసెట్స్ లో వుండాలి. ఎందులో వున్నాయో వెతకాలి. దొరికితే మాత్రం మీకు అందిస్తాను.
రావుగారూ
old telugu songs లో ఈ ఏడు పాటలు మాత్రమే ఉన్నాయి.మిగతావి శ్రీనివాస్ గారి దగ్గర మట్టి రికార్డులు ఉండి ఉండవచ్చు.వాటిని డిజిటైజ్ చేసే పరిజ్ఞానం, సమయం లేదు అన్నారు కాబట్టి మీకు దొరికినవాటిని వినే భాగ్యం కలిగించండి.లిరిక్ విన్నవాళ్ళు రాసేస్తారు.ఆనాటి తెలుగు సంగీతంతో పాటు సాహిత్యమూ మట్టిలో కలిసిపోకుండా కాపాడుతున్న మీ అందరికి ధన్యవాదాలు.
dEvuni mahima Kanakatara 1937
lEvE pErunakenniyO matamulu Malapilla 1938
kollAyi kaTTite Emi Malapilla 1938
lE rA lErA nidura mAni Malapilla 1938
eMta ghOra pAtakamE Tara Sasankam 1941
mAlalu mAtramu manujulu gArA Malapilla 1938
manajula vibhajanamu Malapilla 1938
భూలోకంలో యమలోకం సినిమాలో ఏ.వి.సుబ్బారావు గారి పద్యాలు పాతబంగారం( http://pathabangaram.com/forums/viewtopic.php?f=13&t=2162 )లో అందించారు.
ఈలపాట రఘురామయ్యగారి పాటలు పద్యాలు భక్తమార్కండేయ తదితర సినిమాల్లో ఉన్నాయి. బ్లాగరులకు వినిపించగలరు.
రహమతుల్లా గారూ !
మీ ఆసక్తికి, కృషికి జోహార్లు. ఏ. వి. సుబ్బారావు గారి పద్యాల లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. రఘురామయ్య గారి పద్యాలు నా దగ్గర కొన్ని వున్నాయి. భక్త మార్కండేయ కూడా cassette లో వుండాలి. వీలు చూసుకుని తప్పక అందిస్తాను.
Post a Comment