Thursday, February 4, 2010

తెలుగులో హాస్య నాటిక రచయితలు

తెలుగులో హాస్యనాటికా ప్రక్రియ ప్రారంభమై సుమారు 132 సంవత్సరాలయింది. వాటి పరిణామ క్రమం, ఆ రచయితల పరిచయం క్లుప్తంగా ...................



Vol. No. 01 Pub. No. 183

7 comments:

Saahitya Abhimaani said...
This comment has been removed by the author.
Saahitya Abhimaani said...

విశ్వనాథ కవిరాజు గారు వ్రాసిన మరొక గొప్ప హాస్య నాటిక ఉన్నది. ఆ నాటిక పేరు "నాటికి నేడు". ఈ నాటిక 1960లలో ఆకాశవాణి విజయవాడవారు ప్రసారం చేసారు. ఇందులో రెండే పాత్రలు. ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం పరిచయం ఉండి ప్రేమించుకున్న వారు, ఈ రోజున అనుకోకుండా రైలుబోగీలో రాజమిండ్రి వెడుతూ కలుసుకుంటారు. బోగీలో వాళ్ళిద్దరే. వాళ్ళ మధ్య జరిగే అద్భుతమైన సంభాషణలు ఎంత హాస్యం కలిగిస్తాయో చెప్పలేను. ఈ పాత్రలలో రేడియో కళాకారులు శీతారత్నం గారు, వెంకటేశ్వర రావుగారు అద్భుతంగా జీవించారు. ఈ నాటిక ఎక్కడైనా ఎవరిదగ్గరైనా రికార్డు అయిఉండి దొరికితే ఎంతబాగుండును.

అలాగే నండూరి సుబ్బారావుగారు, రేడియో కళాకారుడు, ఆకాశవాణి విజయవాడలో పనిచేసారు. ఆయన అనేకమైన 15 నిమిషాల నాటికలు వ్రాశారు అందులో నటించారు కూడ అవ్వొక అద్భుతమైన రోజులు, విజయవాడ రేడియో స్టేషనుకు స్వర్ణ యుగం. మళ్ళి రావు ఆరోజులు.

SRRao said...

శివ గారూ !
ధన్యవాదాలు. కవిరాజు గారి నాటిక నేను కూడా చాలాసార్లు విన్నాను. రికార్డింగు ప్రయత్నం చేద్దాం ! 'దొంగాటకం' కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రదర్శించి బహుమతులు కూడా అందుకున్నాం ! అందులో కూడా మూడే పాత్రలు. పోలీసు, భార్య, దొంగ.
రంగస్థల నాటికల మీద దృష్టి పెట్టడం వలన నండూరి సుబ్బారావు గారిని మరచి పోయాను. ఆయన రేడియోకి మంచి హాస్య నాటికలు రాశారు. మీరు చెప్పినట్లు ఆ రోజులు నిజంగానే స్వర్ణయుగం.

మధురవాణి said...

చాలా విలువైన సమాచారం అందించారు. వీటిల్లో ఏవైనా పుస్తక రూపంలో దొరికే అవకాశం ఉందండీ.?

SRRao said...

మధురవాణి గారూ !
ధన్యవాదాలు. రావికొండలరావు గారి నాటికల సంపుటం ప్రస్తుతం దొరుకుతున్నది. విశాలాంధ్ర లాంటి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. మిగిలినవి రీ ప్రింట్ల పరిస్థితి నాకంతగా తెలియదు. నేను ఇవన్నీ చదివి / చూసి / వేసి దాదాపు ఇరవై, ముఫ్ఫై సంవత్సరాలయిపోయింది. కానీ వాటిలోని జీవం ఇంకా గుర్తుండిపోయేటట్లు చేసింది.

Saahitya Abhimaani said...

రావుగారూ. ఇంతకాలానికి, మళ్ళి "నాటికి నేడు" నాటిక వినగలిగే అదృష్టం కలిగింది. శ్రీ కారంచేడు గోపాలంగారు తన దగ్గర ఉన్న ఈ నాటిక రికార్డింగును, మాగంటి వంశీ గారికి పంపారు. ఆయన తన వెబ్సైటులో రేడియో అభిమానులు వినటానికి ఉంచారు. ఈ కింది లింకు నొక్కి మీరు ఆ నాటిక వినవచ్చు.

http://maganti.org/audiofiles/air/dramas/natikinedu.html

మరదే వెబ్ సైటులో అటూ ఇటూ తిరుగాడితే ఎన్నెన్నో బంగారు గనులు ఉన్నాయి.

మీ దగ్గరకాని, మీకు తెలిసిన వారివద్ద కాని రేడియో రికార్డింగులు (ఏవైనా సరే) ఉంటే సంపాయించి అప్లోడ్ చెయ్యగలరు. మనకు అలనాడు లభించిన అద్భుత కళారూపాలను పదిలపరిచే ప్రయత్నంలో మీ సహాయం కూడ కావాలి. ఈ వ్యాఖ్య చదివిన వారందరికీ కూడా ఇదే విజ్ఞప్తి.

SRRao said...

శివ గారూ !
చాలా చాలా ధన్యవాదాలు. ఈ నాటిక మంచి ప్రయోగం. రేడియోలో ప్రసారమైన చాలాసార్లు విన్నాను. నాకు చాలా ఇష్టమైన నాటికల్లో ఒకటి. మీకు మాగంటి వారికి, శ్రీ కారంచేడు గోపాలం గారికి కృతజ్ఞతలు. మీరన్నట్లు నాటికలే కాక ఇంకా కొన్ని ఆణిముత్యాల కోసం ప్రయత్నం చేసే పనిలో ఉన్నాను. ఫలిస్తే తప్పకుండా మీకు, అందరికీ అందిస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం