సాక్షి రంగారావు గొప్ప నటుడు. నవరసాల్ని అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటుడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా తడబాటు లేకుండా, మాడ్యులేషన్ తప్పకుండా, మూడ్ చెడిపోకుండా సునాయాసంగా సీను పండించేసేవారు. ముఖ్యంగా కరుణరస సన్నివేశాలలో నటించేటప్పుడు తాను ఆ సన్నివేశంలో లీనమై పోవడమే కాదు. చుట్టూ ఉన్న చిత్ర యూనిట్ సభ్యులని కూడా కదిలించేవారు. పాత్రలో జీవించడమనే దానికి ఆయన నటనే ఉదాహరణ.
కె.విశ్వనాథ్ గారి ' జననీ జన్మ భూమి ' చిత్రం కోసం ఆయనతో కలసి పనిచేసే అవకాశం కలిగింది. ఆ చిత్రంలో ఒక సన్నివేశం - ఒక ఫ్యాక్టరీ కార్మికుల సమ్మెలో అల్లర్లు రేపడానికి గోకిన రామారావు కొంతమంది నిరుద్యోగుల్ని తీసుకెడతాడు. అక్కడ వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారందర్నీ తీసుకొచ్చి ఊరి మధ్యలో విడిచి పెడతారు. అందులో ఆ ఊరి పోస్ట్ మాన్ అయిన సాక్షి రంగారావు కొడుకు కూడా ఉంటాడు. స్వతహాగా నెమ్మదస్తుడైన అతను తండ్రికి భారంగా ఉండలేక, నిరుద్యోగాన్ని భరించలేక ఆ గుంపులో చేరుతాడు. అందులో అతన్ని చూసిన ఊరి జనం ఆశ్చర్యపోతారు. రకరకాలుగా అనుకుంటారు. ఆ అవమానం భరించలేక ఊరి వెలుపల చెట్టుకి ఉరి వేసుకుని చనిపోతాడు. ఉదయాన్నే తన కొడుకు కోసం వెతుకుతున్న సాక్షికి కొడుకు కనబడతాడు. అంతే ! ఆ దృశ్యం చూసి ఆక్రోశిస్తాడు. రాజకీయనాయకుల చేతిలో పావులై, తమ బిడ్డల్ని పోగొట్టుకున్న సగటు తండ్రి ఆవేదనను ఆ సన్నివేశంలో ఆవిష్కరించిన సాక్షి నటన అద్భుతం. నటనలో జీవించడమంటే ఏమిటో అప్పుడు చూసాను. సుమారు ఆరు నిముషాల పైన ఆ డైలాగులు ఒకే షాట్ లో ఒకే టేక్ లో వివిధ రకాల భావాలను వ్యక్తీకరిస్తూ చెప్పిన తీరు యూనిట్ మొత్తాన్ని కంట తడి పెట్టించింది. నిజానికి ఆ సన్నివేశాన్ని విశ్వనాథ్ గారు కనీసం మూడు, నాలుగు షాట్స్ గా చిత్రీకరిస్తారు. కానీ ఆ టేక్ లో కట్ చెప్పకుండా, చెప్పబోతున్న కో - డైరెక్టర్ నండూరి విజయ్ గారిని వారించి ఆ ప్రవాహం కొనసాగించారు. తర్వాత కొన్ని షాట్స్ తీసుకుని జత చేసారనుకోండి.
ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూన్న యువకుల, విద్యార్థుల తల్లిదండ్రుల గర్భశోకానికి దర్పణం సాక్షి రంగారావు నటన. ఆ సన్నివేశంలో సాక్షి రంగారావు నటించలేదు. జీవించాడు...... చూడండి.
Vol. No. 01 Pub. No. 179
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
No comments:
Post a Comment