గూడవల్లి రామబ్రహ్మం గారి పేరు చెప్పగానే ' మాలపిల్ల ', ' రైతుబిడ్డ ' చిత్రాలు గుర్తుకు వస్తాయి. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనదొక సువర్ణాధ్యాయం. ఇంత పరిణితి చెందిన ప్రేక్షకులున్న రోజుల్లో కూడా చిత్ర నిర్మాతలు, దర్శకులు ధైర్యం చెయ్యలేని సాహసాల్ని, ప్రయోగాలని ఆయన ఆ రోజుల్లోనే చేశారు.
ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన అనుమకొండ సూర్యనారాయణ గారు అకౌంట్స్ లో దిట్ట. అసలు సినిమా రంగంలో నిర్మాణ కార్యక్రమాలకు ప్రొడక్షన్ మేనేజర్ కీలకం. దూషణ, భూషణ, తిరస్కారాలకు సిద్ధంగా ఉండాలి. సరైన ప్రణాళికలు రూపొందించడం దగ్గరనుండి చిత్ర నిర్మాణం సక్రమంగా పూర్తవడం వరకూ ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యత వహిస్తాడు.
రామబ్రహ్మం గారు ఉదార స్వభావులుగా పేరు పొందారు. అయితే ఆయనకు ప్రథమ కోపం జాస్తి అని చెప్పుకుంటారు. చిన్న చిన్న విషయాలకు కస్సు బస్సుమనేవారట. అయితే ఆయన వితరణ ముందు ఇవి తేలిపోయేవి. ఆయన తిట్టినా ఎవ్వరూ అంతగా బాధపడేవారు కాదట.
ఒకసారి ఆయన చిత్రం ఒకటి పూర్తయింది. అందరికీ ఇవ్వవలిసిన పారితోషికాలు పూర్తిగా ఇచ్చేసి పంపే పనిలో ఉన్నారు. అందరివంతూ పూర్తయి సూర్యనారాయణగారి వంతు వచ్చింది. మొత్తం చిత్ర నిర్మాణ ఖర్చులన్నీ అప్పగించమన్నారాయన్ని రామబ్రహ్మం గారు.
సరే ! పక్కాగా రాసి ఉంచిన లెక్కల్ని ఆయన ముందు పెట్టారు సూర్యనారాయణ గారు.
మొత్తం జాబితా అంతా పరిశీలించిన రామబ్రహ్మంగారు చివరగా కనబడ్డ ఒక అంశానికి ఆశ్చర్యపోయారు.
ఆ అంశమేమిటంటే ' ఈ చిత్ర నిర్మాణ సమయంలో మీరు నన్ను తిట్టినా తిట్లు 642 ' అని రాసి ఉంది.
అంతే... గూడవల్లి రామబ్రహ్మంగారికి కోపం..... కాదు... ఆయనలోని ఉదారత బయిటికోచ్చింది.
తిట్టుకి రెండు రూపాయిలు చొప్పున 1284 రూపాయిలు సూర్యనారాయణ గారికి ఇచ్చారుట.
ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరుకుతారా ?
Vol. No. 01 Pub. No. 200
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
3 comments:
baagundi.............
"పరిణితి చెందిన ప్రేక్షకులు" చక్కటి మాటలు చెప్పారు రావుగారూ. ఇప్పటి సినిమాలు "ఇలా" ఉండటానికి, అప్పటి సినిమాలు గొప్పగా ఉండటానికి ముఖ్య కారణం, ప్రేక్షకులలో దిగజారిన అభిరుచులు. క్లాస్ సినిమా మాస్ సినిమా అని ఎప్పుడైతే మొదలు పెట్టారో, చివరకు సమీక్షకులమని చెప్పుకునే వారుకూడ, మన సినిమా అధోగతికి చేరిపొయ్యింది. పరిణితి చెందిన ప్రేక్షకుడు బాగా చదువుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని, బాల్కనీలో కూచున్నవాడే అయ్యి ఉండక్కర్లేదని, 1940,1950లలోను కొంతవరకు 1960లలోను వచ్చిన అద్భుత సినిమాలు ఋజువు చేశాయి. ఈ మధ్య విడుదలయ్యిన ఒక సినిమాకి ఎటువంటి ప్రేక్షకులు వచ్చారో చూద్దామని(విజయవాడలో)సినిమా అయిపోయే సమయంలో అన్నిటికంటే ఎక్కువ టిక్కేట్టు ధర ఉన్న వాకిలి దగ్గర కాపు కాశాను. బయటకు వస్తున్న వాళ్ళను చూస్తే, ఇటువంటి సినమాకు వీళ్ళుకాకపోతే ఎవరు వస్తారు అనిపించింది. ఒక్కడు కూడ గుట్కా నమలకుండా లేదు. లేకి నవ్వులు వెర్రి మాటలు మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు. వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు అద్భుతం, 100డేస్ , అద్దిరిపోయింది అని వెర్రి కేకలు పెడుతుంటే, అదిచూసి, తమ సినిమా ఏదో కళా ఖండమని విర్రవవీగే వాళ్ళు దర్శకులట.
ప్రేక్షకులలో పరిణితి-తీరు తెన్నులు అన్న విషయం మీద ఒక వ్యాసం వ్రాయండి రావుగారూ. మీ దగ్గర ఉన్న సమాచారం తో మీరు వ్రాస్తే న్యాయం చెయ్యగలరు.
* వినయ్ చక్రవర్తి గారూ !
ధన్యవాదాలు.
* శివ గారూ !
చక్కటి వివరణాత్మక వ్యాఖ్య రాసినందుకు కృతజ్ఞతలు. నా అనుభవంలో ప్రేక్షకులలో పరిణితి చాలానే వచ్చిందండీ! అది మాస్ అయినా క్లాస్ అయినా ! కానీ నిజానికి పరిణితి రానిది పరిశ్రమ పెద్దలకే ! ఈ రోజుల్లో పరిణితి చెందిన ప్రేక్షకులు థియేటర్ కొచ్చి సినిమా చూసే సాహసం చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదు. ఇక మీ అనుభవంలో మీరు చూసినది కాలక్షేపం ప్రేక్షకులను మాత్రమే ! వారికి సినిమా సెన్స్ కంటే మైక్ సెన్సే ఎక్కువ. అదే చానళ్ళ వారికి కావాలి. మీకొక రహస్యం. ఇలాంటి కొత్త సినిమాల పరిచయాలను మొదటిసారి తెలుగు టీవీలకు పరిచయం చేసిన పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది. తిట్టుకోకండి. ఇప్పటి సూపర్, హండ్రెడ్ డేస్ లాంటి పరిచయాలు కాదు. సినిమాల గురించి నిజమైన పరిచయాలే !
Post a Comment