Saturday, February 27, 2010

బాలు గారి తొలిపాట గురించి పద్మనాభం

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న కథ చిత్రం ద్వారా శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని తెలుగు చలన చిత్ర ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత పద్మనాభం గారనే విషయం అందరికీ తెలిసినదే ! ఆ చిత్రంలోని ఏమి ఈ వింత మోహం... అనే పాట ద్వారా ఆ పరిచయం జరిగిందనే విషయం కూడా అందరికీ తెలిసినదే ! ఆ పాట మొదట ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, రఘురామయ్య, సుశీల గార్లతో పాడించాలని అనుకున్నారట.  కానీ ఘంటసాల గారి తల్లిగారికి ఆరోగ్యం బాగులేక వూరికెళ్ళడంతో ఆ అవకాశం సంగీత దర్శకుడు కోదండపాణి గారి ద్వారా పరిచయమైన బాలు గారికి ఇచ్చారు పద్మనాభం.  ఆ విశేషాన్ని వివరిస్తూ పద్మనాభం గారు .................

" మేస్టారి అమ్మగారికి పెద్ద సుస్తీ చేసి ఆయన వాళ్ళ వూరు వెళ్ళారు. ఇటు చూస్తే పాట చిత్రీకరణ పూర్తి చెయ్యాలి. అందుకని పాట త్వరగా రికార్డు చెయ్యాలి. మాకు కొత్త కుర్రాడు గుర్తొచ్చాడు. చూద్దాం. ముందు అతనిచేత పాడిద్దాం. అంతగా బాగుండకపోతే ఆ తరువాత మళ్ళీ అండరినీ కలుపుకుని ఇంకోసారి రికార్డు చేదామని అనుకున్నాం. బాలు వచ్చాడు. ముగ్గురు ఉద్ధండుల మధ్య పాడుతున్నానన్న భయం ఎంతమాత్రం లేకుండా రిహార్సల్స్ లో పాల్గొన్నాడు. రికార్డింగ్ లోనూ దంచేశాడు. నాకు అతని గళం నచ్చింది, అయినా మర్యాదకోసం మేస్టారు వూరినుంచి వచ్చాక ఆయనకు పాట వినిపించాం. ఆయన కూడా కుర్రాడు అద్భుతంగా పాడాడు. ఉంచేయండన్నారు. అలా బాలు గాయకుడయ్యాడు " అని ఓ సందర్భంలో చెప్పారు.  



Vol. No. 01 Pub. No. 210

3 comments:

జయ said...

ఈ విషయం బాల సుబ్రహ్మణ్యం గారు కూడా ఎప్పుడూ చెప్పుతూ ఉంటారు. కొదండపాణి గారి పేరు తన రికార్డింగ్ థియేటర్కి పెట్టుకున్నారు కూడా. ఈ పాట మాత్రం నేనిప్పుడే చూస్తున్నానండి.

Vinay Chakravarthi.Gogineni said...

nice.........

SRRao said...

* జయ గారూ !
* వినయ్ చక్రవర్తి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం