Tuesday, February 9, 2010

మేరా భారత్ మహాన్

మనం దేశ పౌరులుగా అనేక రకాల పన్నులు కడుతున్నాం. కానీ అందులో ఎంతభాగం ప్రజా సంక్షేమం కోసం వినియోగమవుతోంది, ఎంతభాగం నాయకుల సంక్షేమం కోసం వినియోగమవుతోంది అనేది పట్టించుకోం ! ఒకసారి కొన్ని నిజాలు తెలుసుకుందాం !

మన
దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుని ( M.P. ) గౌరవ వేతనాలు, భత్యాలు ఇలా ఉన్నాయి.
  • నెల జీతం : రు. 12, 000/-
  • నియోజక వర్గ ఖర్చు (నెలకు ) : రు. 10, 000/-
  • కార్యాలయ ఖర్చులు (నెలకు ) : రు. 14, 000/-
  • ప్రయాణ భత్యం : కిలోమీటరుకు రు. 8/- (ఉదాహరణకు రాజధాని ఢిల్లీ నుండి దక్షిణ కొసనున్న కేరళకు మారుగా 6, 000 కిలోమీటర్లు ) చొప్పున రు. 48, 000/-
  • పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నపుడు రోజు వారీ భత్యం : రు. 500/-
  • రైలు ప్రయాణ ఖర్చులు : దేశంలో ఎక్కడినుండి ఎక్కడికైనా, ఎన్నిసార్లు అయినా రైలులో మొదటి తరగతి . సి. ఉచితం.
  • విమాన ప్రయాణం : వాణిజ్య తరగతిలో భార్య లేదా భర్త / వ్యక్తిగత సహాయకుడు తో సంవత్సరానికి 40 సార్లు ఉచితం.
  • వసతి : ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుల హాస్టల్ లో ఉచితం.
  • విద్యుత్ ఖర్చులు : నివాసానికి 50, 000 యూనిట్ల వరకూ ఉచితం
  • ఫోన్ ఖర్చులు : 1, 70, 000 కాల్స్ వరకూ ఉచితం
  • మొత్తం ఖర్చులు : ఒక్కొక్క సభ్యునికి సంవత్సరానికి సుమారుగా రు. 32, 00, 000/- అంటే నెలకు సుమారు రు. 2, 66, 000/-
  • పదవీకాలానికి ( 5 సంవత్సరాలకు ) మొత్తం ఖర్చు : రు. 1, 60, 00, 000/-
  • పార్లమెంట్ సభ్యుల మీద మొత్తం ఖర్చు : అయిదు సంవత్సరాలకు మొత్తం 534 సభ్యుల మీద దేశం పెడుతున్న ఖర్చు రు. 8, 54, 40, 00, 000/- అంటే సుమారు రు. 855 కోట్లు .

ఇదంతా మనం ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు లోనుండి పెడుతున్న ఖర్చు.
ఇక సామాన్యులకవసరమైన సరుకుల ధరలు పెంచకపోతే ఎలా సమకూడుతుంది ?

Vol. No. 01 Pub. No. 191

3 comments:

మాలా కుమార్ said...

నిజమే కదా .

thinker said...

indulo mana paapam kuDa undi, Elikalanu ennukonnadi manamE kadaa, ennukOvaDam manam chEsina tappu, ennuKokundaa, Otla panduga naadu intlo kurchovadam inkaa pedda tappu, mari rendu cheyakundaa inkem cheyyaali annadi bhetaala prasna

SRRao said...

మాలాకుమార్ గారూ !
ధన్యవాదాలు

థింకర్ గారూ !
మీరుచెప్పింది నిజం. విత్తు ముందా ? చెట్టు ముందా ? లాంటిదే ఇది కూడా ! కానీ ఓటు వెయ్యకుండా ఉండడం కంటే పోటీలో ఉన్న వాళ్ళలో అందరికంటే / అన్నిటికంటే నయమనిపించిన వాళ్ళు / పార్టీలకు వెయ్యడం మంచిది. కనీసం మన ఓటు వేరేవాళ్ళు గుద్దేసుకునే అవకాశం లేకుండా చేసినట్లవుతుంది. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం