Tuesday, February 2, 2010

దాసుగారి కో ' వెల '




ఆంధ్రదేశంలో హరికథ అనగానే గుర్తుకోచ్చేది తొలుత ఆదిభట్ల నారాయణ దాసు గారు. హరికథా పితామహులుగా పేరుగాంచారు.

ఆయన హరికథా చెప్పగలరు. గిరికథా చెప్పగలరు.
తెలుగులో చెప్పి తెలుగు వాళ్ళనే కాదు ఇతరభాషల వాళ్ళను కూడా మెప్పించగలరు.
ఆయనది కంచు కంఠం. మైలు దూరానికి వినబడుతుందని ప్రసిద్ధి.


ఆయన హరికథా విద్వాంసులు గానే కాక శృంగార నాయకుడిగా కూడా పేరుపొందారు. విజయనగరానికి ఆయనకూ ఎంత అవినాభావ సంబంధం ఉందో..... ఆ ఊళ్ళోని కోవెల వీధికి, వారికీ కూడా అంతే విడదీయలేని బంధం ఉంది. దాసు గారి శృంగార జీవితాన్ని వర్ణిస్తూ ఆచార్య యస్వీ జోగారావు గారు ఓ గ్రంథం రాసారు. ఆ గ్రంథం పైన మహాకవి శ్రీశ్రీ తన అభిప్రాయాన్ని ఇలా రాసారు.

" మీ గ్రంథంలో క్రొందనమంతా నాయక సంవరణంలోనే వుంది.
ఈ కావ్యం రచించి విజయనగరం కోవెల వీథికో ' వెల ' నిర్దేశించిన మీ ప్రజ్ఞను ప్రశంసిస్తున్నాను "

Vol. No. 01 Pub. No. 180

4 comments:

జయ said...

నారాయణ దాసు గారి హరికథల గురించి మాత్రమే విన్నాను ఇప్పటిదాకా.

SRRao said...

జయ గారూ !
మనుష్యులందరికీ రెండో పార్శ్వం కూడా ఉంటుంది. మహానుభావులు కూడా దీనికి అతీతులు కారు ధన్యవాదాలు..

Ganti Lakshmi Narasimha Murthy said...

దాసుగారి శృంగార రసాత్మక కావ్యసృష్టికి ఒక చిన్న ఉదాహరణ:దాసుగారికి ఒకసారి వారి మిత్రులు విజయనగరం మహారాజుగారు పురవీధిలో ఎదురుబడ్డారు.మహారాజు గారు గొప్ప రసికులు గావున దాసుగారి నిట్లు పలకరించేరు:"కవవృషభు" లెక్కడికో వెశుతున్నారు? దానికి వెనువంటనే దాసుగారి బదులు:ఇంకెక్కడికి తమవంటి "కామధానువు"దగ్గరికే!-వాక్యం రసాత్మకం కావ్యంకదా-మూర్తి

SRRao said...

మూర్తి గారూ !
శిరాకదంబానికి స్వాగతం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరుదహరించిన విశేషం గతంలో కవి వృషభం పేరుతో రాసాను. ఆ పేరు మీద నొక్కి చూడండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం