మనకి అఖండ కీర్తి రావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఒక్కోసారి ఆ కీర్తి కూడా కొన్ని చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. దానికి ఉదాహరణ ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత సోమర్సెట్ మామ్ ఉదంతం.
ఒకసారి మామ్ భార్యా సమేతంగా స్పెయిన్ దేశం వెళ్లారు. అక్కడ ఆయనకు తన పుస్తకాలమీద ప్రచురణ కర్తల నుంచి పెద్ద మొత్తంలో రాయల్టీ లభించింది. ఇంతవరకూ బాగానే వుంది గానీ అంత పెద్ద మొత్తాన్ని అక్కడినుంచి తీసుకెళ్ళడానికి స్పెయిన్ దేశ చట్టాలు ఒప్పుకోవు. అందుకని ఏం చెయ్యాలో మామ్ కి అర్థం కాలేదు. బాగా అలోచించి ఆ డబ్బును అక్కడే సరదాగా కాలక్షేపం చేసి ఖర్చు చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.
మాడ్రిడ్ లోని అత్యంత ఖరీదైన హోటల్లో బస చేసి భార్యతో కలసి రాజభోగాలు అనుభవించారు మామ్. చాలావరకు ఖర్చు అయ్యాక ఇక తన దేశానికి బయిలుదేరాడు. హోటల్ ఖాళీ చేసే క్రమంలో యాజమాన్యాన్ని బిల్ ఇమ్మని అడిగాడు. దానికి ఆ యాజమాన్యం చెప్పిన సమాధానం సోమర్సెట్ మామ్ ని విస్తుపోయేటట్లు చేసింది.
" అయ్యా ! మీలాంటి గొప్ప రచయిత మా హోటల్లో బస చెయ్యడమే మా అదృష్టం. మీరు ఇక్కడ బస చెయ్యడం వల్ల మా హోటల్ ప్రతిష్ట కూడా పెరిగి మా వ్యాపారం రెట్టింపు అయింది. దానికి మేమే మీకు ఋణపడి వుంటాం. ఇంకా మీ దగ్గర బిల్లు తీసుకోవడమా ? మామీద దయవుంచి మా కోరికను కాదనకండి. ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మా సేవలు మీకు ఉచితమే ! " అన్నాడా హోటల్ యజమాని.
ఇంకేం చేస్తారు సోమర్సెట్ మామ్ తన కీర్తే తనకు తంటా తెచ్చాక..... !

Vol. No. 03 Pub. No. 037
2 comments:
రావు గారు,
' పాటలపల్లకి,'లో 3 వ వార్షికోత్సవం, శ్రీ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి గురించి మీ బ్లాగ్ లో పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
అభినందనలతో,
దుర్గ.
దుర్గ గారూ !
మీరిచ్చిన మంచి సమాచారం మరికొంతమందికి చేరాలని నా బ్లాగులో పెట్టాను. అంతేనండీ ! అసలు సమాచారమిచ్చిన మీకు ధన్యవాదాలు.
Post a Comment