గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుర్సాక్షాత్ పరబ్రహ్మః
తస్మైశ్రీ గురవే నమః
సమస్త ప్రకృతి మనకి గురువే !
నిత్యం మనకెన్నో విషయాలు బోధపరుస్తుంటుంది
సమస్త జనులు మనకు గురువులే !
వారి జీవనశైలితో మనకు కర్తవ్య బోధ చేస్తుంటారు
వీటన్నిటినీ రంగరించి మనకర్థమయ్యేలా బోధించి
పథ నిర్దేశం చేసేవారు మన ఉపాథ్యాయులు
ఉపాథ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాథ్యాయులకు, మిత్రులకు శుభాకాంక్షలు
మన భారత ద్వితీయ రాష్ట్రపతి, తెలుగు వాడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నివాళులు
************************************
అమ్మ అనగానే అదో తీయనైన భావన
అందులోను ఆ అమ్మ విశ్వానికే అమ్మ
కరుణామయి.. ప్రేమ స్వరూపిణి
ఆమే...... మదర్ థెరెసా !!!
మదర్ థెరెసా వర్థంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ....
మదర్ గురించి గతంలోని టపాలు.............
అమ్మ ఎవరికైనా అమ్మ
Vol. No. 03 Pub. No. 025
2 comments:
రావు గారు, నిన్నంతా అనుకున్నాను ఏదో మరచిపోయానని. ఉదయాన్నే మీ బ్లాగు నన్ను మేల్కొలిపింది. చక్కగా వ్రాసారు రాధా కౄష్ణన్ గారి గురించి. మీ స్ఫూర్తితో ఒక చిన్న వ్యాసం వ్రాసాను. నా 'స్వగతం' లో చదవ గలరు.
* సూర్యనారాయణ గారూ !
ధన్యవాదాలు. మీ వ్యాసం చదివాను.
Post a Comment