Saturday, September 3, 2011

సాహితీ ధ్రువతార

 మరో సాహితీ ధ్రువతార రాలిపోయింది
 ఆయన పాత్రికేయుడు మాత్రమే కాదు.... సాహితీవేత్త కూడా.....
ఆయన సాహితీవేత్త మాత్రమే కాదు..... పరిశోధకుడు కూడా.....
ఆయన పరిశోధకుడు మాత్రమే కాదు.... విజ్ఞానవేత్త కూడా.....
ఆయన విజ్ఞానవేత్త మాత్రమే కాదు......... సాహితీ సుక్షేత్రంలో అన్నీ

పత్రికలకు విలువ నేర్పినవారు
అనువాదకులకు అర్థాలు నేర్పినవారు
నరావతారాన్ని చదువరులకు చూపించినవారు
తెలుగువారందరికీ విశ్వదర్శనం చేయించినవారు
విజ్ఞానగ్రంథాల రచనలో విశ్వరూపం ప్రదర్శించినవారు 

పెద్దలకోసం పెద్ద గ్రంథాలు అనువుగా రాసారు
తెలుగులో విజ్ఞాన సాహిత్యం లేదనే కొరత తీర్చారు
పిల్లలకోసం బాల సాహిత్యం సులువుగా తెనిగించారు
మార్క్ ట్వైన్ ఆంధ్రుడిగా పుట్టి తెలుగులో స్వయంగా రాసాడా అనిపించారు

ఆ ధ్రువతార రాలిపోయింది..... ఆ సాహితీవనం వాడిపోయింది
ఆయన కలం ఆగిపోయింది..... ఆయన గళం మూగవోయింది
అయినా ఆయన రచనలు సాహితీవినీలాకాశంలో ఎప్పటికీ ద్రువతారలే !
అయినా ఆయన పంచిన విజ్ఞానం సాహితీవనంలో ఎప్పటికీ వాడని కుసుమాలే !!

రాలిపోయిన మరో సాహితీ ధ్రువతార నండూరి రామమోహనరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ..... 


నండూరి వారు తీర్చిదిద్దిన ఆంధ్రజ్యోతి ఈనాటి సంచికలో ఆయన గురించి ఈ క్రింది లింకులలో ......

సంపాదకీయం .....
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/09/03/ArticleHtmls/03092011004004.shtml?Mode=1

తుర్లపాటి వారి జ్ఞాపకాలు ....
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/09/03/ArticleHtmls/03092011004011.shtml?Mode=1

Vol. No. 03 Pub. No. 023

3 comments:

Dr.Suryanarayana Vulimiri said...

రావు గారు, ఈ వార్త చూడగానే అప్రయత్నంగా కళ్ళు అశ్రుపూరితాలయాయి. అలనాటి "నరావతారం" తో నాకు నండూరి వారి రచనలు పరిచితం. మీరు ఆయన గురించి వ్రాసినది అక్షర సత్యం. నిజమే మరో ధ్రువతార శ్రీ రామ మోహన రావు గారు. వారి ఆత్మకు శాంతి కలగాలని అందరం ప్రార్థిద్దాం.

susee said...

telugu saahithee vinu veedhi lo 'dhruva taara ' sri nanduri rama mohana rao gaaru.vaari aswasthata kontha aandolana kaliginchite- vaari maranam poorthigaa vishaadaanne migilinchindi.vaariki naa shraddhaanjali. vaari kutumbaaniki naa pragaaadha saanubhuti ni andajesthunnaanu.-voleti venkata subbarao ,vernon hills-IL/USA.

SRRao said...

* సూర్యనారాయణ గారూ !
* సుబ్బారావు గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం