* " నేను సిగరెట్లు త్రాగడం మానేసాను తెలుసా ? " అన్నారు దర్పంగా ఆరుద్ర.
" అదేం పెద్ద గొప్ప ! నేను అలా చాలాసార్లు మానేసాను " అన్నారు ముళ్ళపూడి వారు.
* ఒకాయన ముళ్ళపూడి వారి దగ్గరకు వచ్చాడు. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ ఆయన రమణ గారితో " మద్రాసులో ఎక్కువగా అరవ వాళ్ళే వుంటారు కదా ! వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా ? " అనడిగాడు. దానికి రమణ గారు తన మార్కు జవాబిచ్చారు.
" ఏముందీ ? మీరు పేపర్ కొని చదువుకుంటుంటే, మధ్యలో ఆ పేపర్ని ఎవరు అడిగి తీసుకుంటారో వాడే తెలుగు వాడు " అన్నారు.
* " ఏమిటండీ మీ వ్రాత ఇలా వుంటుంది ? " అన్నాడట ఓసారి ముళ్ళపూడి వారి పుస్తకాన్ని ప్రచురణకు సిద్ధం చేస్తున్న కంపోజిటర్.
" అందుకేనయ్యా ! నా రాత ఇలా వుంది " అని ముళ్ళపూడి వారి సమాధానం.
5 comments:
*sanghatanaasthali: PWD Guest House:Dowlaiswaram
*year: 1972-
*charchaneeyaamsham:Andhra Raashtra tadupari mukhya mantri?charchalo palgonnavaaru: sarvasri BapuRamana,MVL,Sitaramudu,Nanduri, Pulidindi Raju garalu .
?-prasna-( vesina varu) Sri MVL: Ninna monnati varakoo manaki raastra mukhya mantri gaa vunna Sri P V Narasimha Rao garu delhi ki congress president gaa vellipovadamtho- ikkada aakhaaleeki- manaki- manam teese cinimaalaki sadupaayam gaa vuntundi mana 'raju' gaarini nilabedithe saripoledoo..?!
samaadhanam :( Sri Ramana garu):
'raju' garu 'rajugaare' gaanee 'mantri 'gaarelaa avuthaaroo.. ?
andaroo 'navvulavirijallulalo' tadusthoonte- akkada vunna nenoo-a navvulajallulalo- challadanaanni -tadisi- maree anubhavinchaanu- voleti venkata subbarao,slough/United Kingdom.
రమణగారి మాటల చమత్కారాలు ఎన్నెన్నో. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
ఓక సారి నాకు "ముళ్లపూడి సాహితీ సర్వస్వం" లో సంతకంచేసి, క్రింద బాపూ
గారి సంతకం కూడా తనే చేసి బ్రాకెట్లో "ఆధరైజ్డు ఫోర్జరీ" అని కొసమెరుపు ఇవ్వడం
ఆయనకే చెల్లింది. ఆయన మాటల చమత్కాలెన్నో! నా కార్టూన్ పుస్తకంలో ముందు
మాట వ్రాస్తూ ఒక చోట ఇలా అన్నారు. " వెనకనుంచి వినబడే- గులాం పాటలు
వింటూ....." హాస్య రచయితలు ఎంతమందైనా వుండొచ్చు. అక్షరాలతో ఆడుకొనే
హాస్యరచయితల్లో ముళ్లపూడికి మెరెవరూ సాటి లేరు.
ఈ సిగిరెట్టు మానెయ్యటం జోక్ మార్క్ ట్వైన్ గురించి కూడా చెప్తారు.
అడిగిన స్నేహితుడితో మార్క్ ట్వైన్ ఇలా అన్నారుట:
" సిగిరెట్లు మానేయ్యటమా! ఎముందోయ్! చాలా సులభం నేను చాలాసార్లు మానేసాను"
సామాన్యంగా, చాలా సార్లు చెయ్యగలిగిన పని సులభం . కాని అన్నిసార్లు సిగిరెట్ మానెయ్యటం బలహీనత. దాన్ని హాస్యంతో చెప్పటం రచయిత చమత్కారం.
@susee
తెలుగును అలా ఆంగ్ల లిపిలో వ్రాసి ఖూనీ చెయ్యటం ఎందుకండీ . హాయిగా లేఖినిలో వ్రాసి ఇక్కడ ఉంచితే చదివే వారికి సులభం.
* సుబ్బారావు గారూ !
మంచి ఛలోక్తి చెప్పారు. ధన్యవాదాలు. ఇది నా దగ్గరుంది. అయితే ప్రత్యక్ష సాక్షిగా మీరు చెప్పడం ఇంకా బాగుంది. ఇది తెలుగు లిపిలో త్వరలో ప్రచురిస్తాను.
శివగారి సూచన గురించి ఆలోచించండి. లేఖిని కాకుండా ఇంకా మీరు అక్షరమాల, microsoft transliteration, fire fox లోనైతే google transliteration లాంటివి చాలా వున్నాయి. ప్రయత్నించండి.
* అప్పారావు గారూ !
చాలా సంతోషం. మంచి విషయాన్ని అందించారు. నిజమే మీరన్నట్లు అక్షరాలతో ఆడుకునే గొప్ప రచయితా ముళ్ళపూడి వారు. ధన్యవాదాలు.
* శివ గారూ !
ధన్యవాదాలు
Post a Comment