వందనం ఇదే వందనం ...............
వందనం కరివదన కరుణా సదన
నీ పదకమలముల కడ
వందనం ఇదే వందనం ................
అయ్య కడ ఐశ్వర్యమడిగి
అమ్మ కడ సౌభాగ్యమడిగి ..........
నెయ్యమున నీ చరణదాసులకియ్యవా....
దేవాదిదేవా....... దేవాదిదేవా.......
వందనం ఇదే వందనం ...... వందనం గిరి నందినీ ప్రియనందనా ......
వెన్నవలె వెన్నెలలవలె
క్రొన్ననల వలె మెత్తనిది నీయెద.........
నేతవని వరదాతవని సంజాతవని
దేవాదిదేవా........ దేవాదిదేవా........
వందనం ఇదే వందనం ...... వందనం గిరి నందినీ ప్రియనందనా ......
మధురకవి మహాకవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి సాహిత్యాన్ని
బండారు చిట్టిబాబు గారి స్వరకల్పనలో
మధుర గాయని శ్రీమతి నీరజ విష్ణుభొట్ల
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం కోసం ఆలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి.
Vol. No. 02 Pub. No. 185
8 comments:
amma gurtostunnaaru eepaatato.prati pandugaku saayamkaala haarati ide paatato modalu pettevaaram.
ammaaaaaaaaa.
ఇది బాలాననందం పిల్లల కార్యక్రమంలో వినడం గుర్తు. కానీ కాస్త వేరే ట్యూను.
చాలా సింపుల్ గా ఉండే భావనతో ఈ ప్రార్థన నాకెంతో ఇష్టం.
ఈ పాట బావుంది. పంచుకున్నందుకు ధన్యవాదాలు. కానీ ... నాకు అప్పుడు విన్న ట్యూను (బహుశా నా జ్ఞాపకం కాబట్టి అయ్యుండ వచ్చు) దొరికితే వినాలని ఎప్పట్నుంచో ఆశ.
Lalitha garu,
The tune you mentioned is a really wonderful one. My friends and I learnt it listening to Baalaanandam, hyderabad AIR. Later Chittaranjan garu taught me in my first class at his home.I've to check up if the tune is by Paalagummi garu or Chittaranjan garu.
I, madhuri, posted the above coment.
* కృష్ణుడు గారూ !
* లలితా గారూ !
* మాధురి గారూ !
ధన్యవాదాలు. నిజానికి మీ అభినందనలు నీరజగారికి చెందాలి.
మాధురి గారూ !
లలిత గారు అడిగిన పాట మీరు ప్రయత్నించి సంపాదించగలిగితే మాక్కూడా పంచండి. లేదా ట్యూన్ గుర్తుంటే ఇప్పుడు పాడి అప్లోడ్ చేసినా సరే !
I must thank Rao garu for uploading this on to his blog. Thank you all. Thank you very much for your comments. They mean a lot to me.
Regards
Neeraja Vishnubhatla
నీరజ గారూ !
సంగీతం, సాహిత్యం నాకు చాలా ఇష్టం. మీ పాటలు అందరూ విని ఆనందించాలనే ఉద్దేశ్యంతో నేనడిగిన వెంటనే నా బ్లాగులో ఉంచడానికి అంగీకరించిన మీకు నా ధన్యవాదాలు.
Post a Comment