Sunday, March 13, 2011

విధ్వంసం - విలయం

 గతవారం వెంట వెంటనే జరిగిన సంఘటనలు గమనించాక ఓ రకమైన స్తబ్దత ఏర్పడింది. ఏమని స్పందించాలో తెలియని పరిస్థితి. స్పందించకుండా ఉండలేని పరిస్థితి. ఒకటి ప్రకృతి సృష్టించిన విలయమైతే మరొకటి మనకి మనమే సృష్టించుకున్న విధ్వంసం.                                     

  ఆత్మహత్యా సదృశము
                 
 
ఠీవిగా నిలబడ్డ తెలుగు తేజం నేలకొరిగింది 
తెలుగుజాతి ఆత్మగౌరవం వీధిపాలయింది   

విగ్రహాలను కేవలం రాతిబోమ్మలుగా చూస్తే
అరాచకమైన పనులు రాతిమనుషుల్లా చేస్తే

అనుకున్నది నెరవేరుతుందా ? ఆశయం సిద్ధిస్తుందా ?
మన గౌరవాన్ని మనమే నేలపాలు చేసుకోవడం తప్ప  

 రాష్ట్రం సమైక్యంగా వున్నా, రెండుగా చీలినా
మనమందరం తెలుగువారం..మనది తెలుగు జాతి

అది గమనించి స్వార్థ రాజకీయాల ముసుగు మనమే తొలగించాలి
లేకుంటే ఇలాంటి సంఘటనలు మనకు ఆత్మహత్యా సదృశాలవుతాయి

  ప్రకృతి విలయ తాండవం  

ప్రకృతి మళ్ళీ కన్నెర్ర చేసింది 
అన్నిటా మిన్న అనిపించుకున్న దేశం 
అంతులేని విషాదంలో మునిగిపోయింది.
నిన్నటి వరకూ ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసిన దేశం.. నేడు కనీ వినీ ఎరుగని నష్టాన్ని చవి చూసింది. వారి సాంకేతిక పురోగతి ఇప్పుడు వారి మనుగడకే సవాల్ విసిరింది. అణువిస్పోటనం వారినే కాదు ప్రపంచాన్నే వణికిస్తోంది. జపాన్ ప్రజల కడగండ్లు తీరేదేప్పుడో.... మళ్ళీ జపాన్ కు పూర్వ వైభవమెన్నడో.... 

Vol. No. 02 Pub. No. 171

2 comments:

Bhaskar Sarma said...

జపాన్లో జల ప్రళయం.....
రాజధానిలో రాజకీయ రాక్షసుల రగడ.....
Cannot be excused forever....

SRRao said...

భాస్కర్ !
ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం