Thursday, March 3, 2011

'వాహినీ' కుమారి

 ' వాహినీ ' కుమారిగా ప్రసిద్ధి చెందిన రాజకుమారి.......మద్దెల నాగరాజకుమారి గత తరం ప్రేక్షకులకు అప్పటి నటీమణులలో చిరపరిచితమైన పేరు. 

తెనాలికి చెందిన మద్దెల నాగరాజకుమారి అందం 1934 లోనే సి. పుల్లయ్య గారి ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలోను, వేల్ పిక్చర్స్ వారి ' సీతాకళ్యాణం ' చిత్రంలోనూ అవకాశాలు వెదుక్కుంటూ వచ్చేటట్లు చేసింది. అయితే నటన, చిత్ర పరిశ్రమ అంటే భయపడ్డ ఆమె తల్లి వాటిని తిరస్కరించింది. 1937 లో ఒక బంధువు ప్రోద్బలంతో ' దశావతారాలు ' చిత్రానికి జరిగిన సెలక్షన్లో కుమారి ఎంపికయ్యారు. తోలి చిత్రంలోనే లక్ష్మి, సీత, యశోధర పాత్రలు ధరించి త్రిపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత 1939 లో ' అమ్మ ' , ' ఉష '  అనే చిత్రాల్లో నటించారు. అయితే ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. ' ఉష ' ఘోరంగా పరాజయం పాలైంది. 

ఇక కుమారి గారి జీవితంలో ముఖ్యమైన ఘట్టం..... వాహినీ పిక్చర్స్ లో అడుగుపెట్టడం. వితంతు పునర్వివాహం ప్రధానాంశంగా వాహినీ వారు 1940 లో నిర్మించిన ' సుమంగళి ' లో ఆమె పోషించిన కథానాయిక పాత్ర ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టింది. తర్వాత వాహినీ వారు పతిత జనోద్దరణ ప్రధానాంశంగా నిర్మించిన ' దేవత ' చిత్రం ఆమెను వాహినీ కుమారిని చేసింది. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం తర్వాత అయిదేళ్లపాటు ఆమె కనుమరుగైపోయింది.
మళ్ళీ 1946 లో ఘంటసాల బలరామయ్య గారి ' ముగ్గురు మరాటీలు ' చిత్రం ద్వారా పునః ప్రవేశం చేసారు. ఆ చిత్రం ఘన విజయం సాధించినా ఆ తరవాత కుమారి కొండచిలువతో పోరాటాలు వగైరా సాహసాలు చేసిన ' మాయపిల్ల ' ( 1951 ) పరాజయం పాలయ్యింది. ఇంకా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచన చేసిన ' ఆకాశరాజు ' చిత్రంలో గౌరీనాథశాస్త్రి గారి సరసన నటించారు. ఇలా ఆమె నటించిన బయిట చిత్రాలలో కొన్ని పరాజయం పొందగా, మరికొన్ని నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. 

మళ్ళీ వాహినీ వారి ' మల్లీశ్వరి ' చిత్రంలో రాణి తిరుమలదేవి పాత్ర కుమారికి మరోసారి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రంలో కుమారిది చిన్న పాత్రే అయినా ఆమెకు వాహినీ కుమారి అనే పేరును శాశ్వతం చేసింది. ఆ తర్వాత మరో మూడు చిత్రాల్లో నటించిన కుమారి 1958 లో మద్రాస్ వదలి విజయవాడ కొచ్చి స్థిరపడ్డారు. శేష జీవితం బెజవాడ లోనే గడిపి 2009 మార్చి 3 న స్వర్గస్తులయ్యారు.  

వాహినీ కుమారి వర్థంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ యుట్యూబ్ లో ప్రణీత్ ఛానల్ లోని ' దేవత '  చిత్రంలోని ఈ పాట చూడండి ............



Vol. No. 02 Pub. No. 163

5 comments:

Durga said...

రావు గారు,
ఇది నాకిష్టమైన పాట. ఈ పాట నేను పాటలపల్లకిలో వేశాను. నాగయ్య గారు ఎంత హ్యాండ్సంగా వున్నారో! చక్కటి పాట. నాకు ఇలాంటి పాటలు వేయడం అంటే చాలా ఇష్టం. మళ్ళి మళ్ళీ వింటాను ఇలాంటి పాటలు.
పాట చూడాలని వుండింది. చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు.

SRRao said...

దుర్గ గారూ !
చాలా సంతోషం. ధన్యవాదాలు.

Nrahamthulla said...

పాత నటులు గాయకులను మళ్ళీ దర్శించుకునేలా చేస్తున్నారు.ధన్యవాదాలు.

SRRao said...

రహమతుల్లా గారూ !
ధన్యవాదాలు

Unknown said...

VAAHINII KUMARI march 3 2011

ii vyaasam calaa bagundi. nenu konta kaalamgaa ilanti paata natii/natulu teramaru gayinavaari jiivita viseshaalu vuniki telusukoavaalani konni cinna vyasaalu vraayaalani prayatnichenu. kaani sariaina protshaaham kanikincha ledu. mii vyaasam cuucaaka malli ii prakriya praarambhinchaalani pisthunnadi. manci vyaasam ilaanti maanikyaalanu maro maaru gurtu cesukodam mana baadyata.

Gumma Raamalinga Swamy

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం