Saturday, April 23, 2011

జానకీ స్వరం

ప్రతీ సంవత్సరం వసంత కాలంలో మాత్రమే కమ్మగా గానం చేస్తుంది కోకిల 

అప్పుడెప్పుడో పురాణకాలంలో అప్పుడప్పుడు దివి నుండి ఆటవిడుపుకోసం భువికి దిగివచ్చి ఉద్యానవనాలలో విహరిస్తూనో, సరస్సుల్లో జలకాలాడుతూనో గంధర్వులు తమ గాన మాధుర్యాన్ని పంచేవారట.

కానీ ఇక్కడ... ఈ భూమ్మీద.... ఈ భారతదేశంలో... అదీ ఆంధ్రదేశంలో ఒక కోకిల మాత్రం నిరంతరం.... అన్ని కాలాల్లోనూ.... అన్ని పరిస్థితుల్లోను గానం చేస్తూనే వుంది.

అప్పుడెప్పుడో కాకుండా, అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ, ఎల్లప్పుడూ మనకి గంధర్వగానం వీనులవిందు చేస్తూనే వుంది.


 ఆ గాంధర్వ కోకిల జానకి మధుర స్వరం
తెలుగు శ్రోతలకు ఆ సుస్వరం ఒక వరం

 కలకాలం ఆ స్వరం తెలుగునాట స్వరమధువులు ఒలికించాలని కోరుకుంటూ గాయని 
 ఎస్. జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలతో............


శ్రీమతి జానకి గారు పాడిన డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి రచన .........

 స్వరకోకిల జానకి గారి గురించి గత సంవత్సరం టపా ..........
నాద ' స్వర ' జానకి

Vol. No. 02 Pub. No. 211

7 comments:

ప్రసీద said...

చాలా మధురమైన గళం ఆమెది. ఏ పాటైనా అవలీలగా పాడేస్తారు ఆవిద.. ఆ గాత్రానికున్న రేంజ్, పవర్, వైవిద్యం అనితరసాధ్యం. శ్రీమతి జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Vinay Datta said...

We join you in greeting Smt S Janaki on the eve of her birthday.

madhuri
vinay datta.

మురళి said...

Happy Birthday Janaki

రాజేష్ జి said...

పాటలు మాత్రమేనా.. ఆమె వ్యక్తిత్వ౦ కూడా విశిష్టమైనది.

ఒకసారి కొచ్చిన్ నుంచి చెన్నైకి వచ్చేప్పుడు జానకి గారిని ఇమానంలో చూసా.. మొదట కొద్దిగా అనుమానం.. ఆవిడేనా కాదా..అని. సరే ఏవైతే అది అని ఆమె సీటు దగ్గరికి వెళ్లి పలకరించా.. అది కూడా "మీరు జానకి గారే కదూ?" అని. ఆ అవును అని చెప్పడమే కాకుండా నా ఆంగ్లపలకరిమ్పుకి తెలుగులో సమాధానమిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత విమానం దిగిన తర్వాత విమానాశ్రయ౦లోనే మళ్ళీ వెళ్లి కలిస్తే ఏ మాత్రం భేషజం లేకుండా ఆప్యాయంగా మాట్లాడి "ఏ ఊరు, ఎక్కడ" తదిర వివరాలు అడిగడమే కాక, మీతో ఒక ఛాయాచిత్రం తీసుకోవాలనిఉంది అని నేనడిగితే వెంబడే ఒప్పుకొని నా కోరికను మన్నించారు. ఆవిధంగా ప్రస్తుతానికి నా జీవితంలో ఒక మహానుభావురాలిని ప్రత్యక్షంగా కలుసుకోగలిగాను. ఆ ఛాయాచిత్రాన్ని వీలున్నప్పుడు మీ అందరితో పంచుకోగలను.

ఇక జానకి గారి ఆహార్య౦ కూడా చూడచక్కగా ఉంటుంది. ఆ రోజు తెల్లచీర, చేతులనిండుగా జాకెట్టు, నుదుట విబూదిరేఖ, హృదయం పైన శ్రీ సత్యసాయిబాబా వారి బిళ్ళ(లాకెట్).. ఆ పై మోహంలో చిక్కటి చిరునవ్వు, మాట్లాడితే కోకిల తియ్యదనం. వెరసి మనకు ఆమెను చూస్తే ప్రశాంతచిత్తం, వదనం కలుగుతాయి.

ఈ సందర్భంగా వారికి
:: జన్మదిన శుభాకాంక్షలు ::

సంగీతవినీలాకాశంలో ఇలాగే ధృవతారగా వెలుగొందుతు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ...!

నా అభిప్రాయాన్ని ఇక్కడ పంచుకునే అవకాశం కల్పించిన ఎస్.ఆర్.రావు గారీకి కృతజ్ఞతలు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అవునా? అసలు గత సంవత్శరం కూడా నేను ఈ టపా చూడలేదంటే యేమనాలి???జానకి గారి గురించి యేం చెప్పుకుని మరేం చెప్పుకోకుండా ఉంటాము.కొన్నాళ్ల క్రితం ఒక సాయంత్రం కొన్ని గంటలు ఆమె సమక్షంలో గడిపే సదవకాశం కొల్పోయినందుకు ఇప్పటికీ విచారిస్తుంటాను.

Subba Rao Venkata Voleti said...

Janakamma galamlo-ye vayasu ammaayi kantham ayinaa-ammamma kanthamayinaa itte imidipothundi. adi aame pratibha ki taarkaanam.saraswathee tanaya jaanakamma gaariki janmadina subhaakankshalu.

SRRao said...

* ప్రసీద గారూ!
* మాధురి గారూ, వినయ్ దత్తా !
* మురళి గారూ !

ధన్యవాదాలు

* రాజేష్ గారూ !
మీరు చెప్పింది నిజం. మరోసారి మీకా అవకాశం రావాలని కోరుకుంటూ...మీకు ధన్యవాదాలు.

* రాజేంద్ర కుమార్ గారూ !
నా టపాలన్నిటినీ నిశితంగా చదివే మీరు గత సంవత్సరం టపా చదవలేదంటే నమ్మలేక పోతున్నాను.
మళ్ళీ జానకి గారిని కలిసే అవకాశం రావాలని కోరుకుంటూ...ధన్యవాదాలతో

* సుబ్బారావు గారూ !

మీరన్నట్లు జానకమ్మ సరస్వతీ తనయే ! ఆమెకు వయసు పెరిగిందేమో కానీ ఆమె గళానికి కాదు. ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం