Monday, February 15, 2010

ఆరుమాసాల సహవాసం


శిరాకదంబం ప్రారంభించి నిన్నటికి ( 14 వతేదీ ) ఆరునెలలు గడచిపోయాయి. తెలుగులో బ్లాగులనేవి ప్రారంభమై చాలాకాలమైనా ఏడున్నర నెలల క్రితం వరకూ నేను అజ్ఞానంలోనే ఉండిపోయాను. నెలన్నర అధ్యయనం చేసి గత సంవత్సరం ( 2009 ) ఆగస్టు 14 వతేదీన నేను కూడా బ్లాగు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి, ప్రారంభించడం ఎలా అనేది పెద్దగా ఆలో్చన లేకుండా ప్రారంభించేసాను. తర్వాత ప్రశ్న ఏం రాయాలి ? మొదట్లో నా భావాలు రాసాను. తర్వాత నా పుస్తకాల ఖజానాలోని విశేషాలను అందించడం మొదలు పెట్టాను.

నా బ్లాగుకి మొదటి వ్యాఖ్య 7 వ టపాకు వచ్చింది. మొదటి వ్యాఖ్యాతలు రాయరాజ్ గారు, నరసింహ గారు, భావన గారు . తర్వాత నా రాతలు చదువుతూ వ్యాఖ్యానం చేసిన మిత్రులు చిలమకూరు విజయమోహన్ గారు, ధరణీ రాయ్ గారు, వినయ్ చక్రవర్తి గారు, కొత్తపాళీ గారు, రవిచంద్ర గారు, బోనగిరి గారు, శివ గారు, జయ గారు , సృజన గారు , మంచుపల్లకీ గారు, సుభద్ర గారు, తృష్ణ గారు, పద్మార్పిత గారు, బుజ్జి గారు, తెలుగు తూలిక మాలతి గారు, వెంకటరమణ గారు, శేఖర్ పెద్దగోపు గారు, మాలాకుమార్ గారు, అమ్మఒడి ఆదిలక్ష్మి గారు, భాస్కర రామిరెడ్డి గారు, వైద్య భూషణ్ గారు, వరూధిని గారు, హరేకృష్ణ గారు, చిన్ని గారు, శ్రీనిక గారు, నేదునూరి గారు, జ్యోతి గారు, ఆచార్య ఫణీంద్ర గారు, మురళీమోహన్ గారు, అప్పారావు శాస్త్రిగారు, సూర్యుడు గారు, ఉష గారు, ఫణి గారు, శిశిర గారు, వాసు గారు, కంది శంకరయ్య గారు, మాడీ గారు, కొత్త రవికిరణ్ ( పూలవాన ) గారు, జలసూత్రం గారు, పరిమళం గారు, నా యిష్టం గారు, వేణు శ్రీకాంత్ గారు, కార్తీక్ గారు, సంతోష్ గారు, నిషిగంధ గారు, సి.బి.రావు గారు, సునీత గారు, సందీప్ గారు, ఆదిత్య గారు, గిరిధర్ గారు, గొర్తి బ్రహ్మానందం గారు, గీతాచార్య గారు, రాజన్ గారు, కెక్యూబ్ వర్మ గారు, రావు గారు, ఊకదంపుడు గారు, సురేష్ బాబు గారు, నాయని ఆదిత్యమాధవ్ గారు, కె.కె. గారు, చెర్రీస్ వరల్డ్ గారు, మహీ గ్రాఫిక్స్ వారికి, సిరిసిరిమువ్వ గారు, రాజన్ గారు, రవి గారు, నాగప్రసాద్ గారు, చదువరి గారు, నాగబ్రహ్మారెడ్డి గారు, అశ్వినిశ్రీ గారు, భైరవభట్ల కామేశ్వర రావు గారు, నెలబాలుడు గారు, ప్రేరణ గారు, ఫణి యలమంచలి గారు, వినయ్ చాగంటి గారు, చంద్రలేఖ 45 గారు, రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు, రావు ఎస్. లక్కరాజు, హర్ష గారు, రాంగోపాల్ గారు, ఆమ్రపాలి గారు, నిరంజన్ గారు, చెప్పుదెబ్బలు పూలదండలు గారు, మధురవాణి గారు, థింకర్ గారు, సురేష్ మ్యూజింగ్స్ గారు ఇంకా అనేకమంది అజ్ఞాతలు. వీరే కాకుండా నా బ్లాగులో వ్యాఖ్యానించకపోయినా స్వయంగా ఫోన్ లో వ్యాఖ్యలు అందించే నవ్వులాట శ్రీకాంత్ గారు, కొత్త రవికిరణ్ గారు....... ఇంతమంది ఇస్తున్న ప్రోత్సాహమనే టానిక్ తాగి నా బ్లాగు బలం పెరిగింది. నాకు తెలుసు. నా బ్లాగులో వ్యాఖ్యలు తక్కువే ! నేను కూడా టపా రాసాక దాని మీద మిత్రుల స్పందనకు ఎదురు చూస్తాను, కానీ ఏ వ్యాఖ్య రాకపోయినా నిరుత్సాహపడను. ఆ రకమైన టపా మిత్రులకు ఎందుకు నచ్చలేదని విశ్లేషించుకుంటాను. దానికి తార్కాణం. చిత్రవైభవం పేరుతో తెలుగు చిత్ర చరిత్రకు సంబంధించిన విశేషాలు ఒక వరుసలో సచిత్రంగా అందించటం ప్రారంభించాను. కానీ వాటికి అంతగా స్పందన రాలేదు. మరి అలా వరుసగా సీరియల్ లాగ ఇవ్వడం మిత్రులకు నచ్చలేదో లేక అంతాకానీ, కొంతకానీ అయ్యాక టోకుగా వ్యాఖ్యానించాలని ఆగారో అర్థం కాలేదు. ఆ విశేషాలను వేరొక పద్ధతిలో ఇస్తే ఎలాగుంటుందనిపించింది. ఏమైనా ఒక అర్థవంతమైన వ్యాఖ్య మనకి సరైన దిశా నిర్దే్శం చేస్తుందని నమ్ముతాను. నా రాతలకు మిత్రులిచ్చిన వ్యాఖ్యలన్నీ నా అదృష్టవశాత్తూ అర్థవంతమయినవే అనుకుంటున్నాను. ' మీ టపా బాగుంది ' అని రాసారని కాదు. మొహమాటానికో, మరో ప్రయోజనానికో కాకుండా హృదయ పూర్వకంగా చేసే మెచ్చుకోలు వ్యాఖ్య కూడా అర్థవంతమైనదే ! నా రాతలకు వచ్చిన కొద్ది మెచ్చుకోలు వ్యాఖ్యలు అలాంటివే అని నమ్ముతాను. అలాగే చాలా వ్యాఖ్యలలో విశ్లేషణలు కూడా ఉన్నాయి. నా రాతలు చదివిన వాళ్ళందరూ వ్యాఖ్యలు రాయాలని లేదు కదా ! రాత నచ్చినా వ్యాఖ్య రాయలేక పోవడానికి అనేక కారణాలుంటాయి. అయితే మన రాతలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మాత్రం వ్యాఖ్యలు తెలియజేస్తాయి. అవి తిరస్కారాలైనా, పురస్కారాలైనా !

ఈ సందర్భంగా మరోవిషయం. ఒక సోషల్ నెట్ వర్క్ లో పరిచయమైన ఒక మిత్రుడు సూటిగా నన్నో ప్రశ్న వేసాడు. మీరు బ్లాగెందుకు రాస్తున్నారు ? సమాజాని ఉద్ధరించడానికా లేక రచనల ద్వారా సమాజంలో మీకొక గుర్తింపు తెచ్చుకుందుకా ? అని. అతనికి నేనిచ్చిన సమాధానం. నా రాతల వల్ల సమాజాన్ని ఉద్ధరించగలననే అత్యాశ నాకు లేదు. నేను రచయితనో, కవినో, సంఘ సంస్కర్తనో కానని నాకు తెలుసు. నాకు తెలిసిన, నేను చదువుకున్న విషయాలు నా దగ్గరే దాచుకోకుండా పదిమందికీ చెబుదామని, ఏదైనా విషయం గురించో, సమస్య గురించో నాలో కలిగే భావాల్ని పదిమందితో పంచుకుందామని మాత్రమే రాస్తున్నాను. అవి కొంతమందికైనా నచ్చితే, ఆహ్లాదం కలిగిస్తే, ఉపయోగపడితే మంచిదే ! ఇక సమాజంలో గుర్తింపుకోసమైతే ఇప్పుడు దాని అవసరం నాకెంతవరకూ ఉందో నా ప్రొఫైల్ చూస్తే తెలుస్తుందన్నాను. పేరు తెచ్చుకునే అవకాశాలు నా చేతిలో పుష్కలంగా ఉన్న కాలంలోనే ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు అవసరమా ? అదీకాక పాపులర్ అవడానికి ప్లాట్ ఫాం ఇది కాదేమోననుకుంటాను. చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో ప్రయత్నం చేస్తే పేరుతో బాటు, డబ్బు కూడా సంపాదించవచ్చేమో ! కానీ నాకా ఆశా, ఆసక్తి రెండూ లేవు. అందుకే పుస్తకాలు, మంచి స్నేహాలు తప్ప మరే ఆస్తి పాస్తులు లేవు.

బ్లాగ్లోకంలో ఆరునెలల సహవాసంలో ఎందరో కొత్త మిత్రులు పరిచయమయ్యారు. ఎన్నెన్నో భావాలు, అభిప్రాయాలు పరిచయమయ్యాయి. సహజంగా వివాదాలకు నేను దూరం. అందుకే వివాదాస్పద అంశాలకు కూడా దూరంగా ఉంటాను. వ్యక్తిగత దూషణలను, అభ్యంతకర వ్యాఖ్యాలను నేను సమర్థించలేను. అందుకే వాటికి దూరంగా ఉంటాను. అంతమాత్రం చేత ఆయా మిత్రులకు దూరమని కాదు. ఈ ఆరునెలలలోనే కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ సంబరంలోను, ఇ-తెలుగు వర్క్ షాప్ లోను పాల్గొనడం, సాహిత్య అభిమాని శివ గారితో కలయిక నాకెంతో ఆనందం కలిగించిన విషయం. రాబోయే కాలంలో బ్లాగు మిత్రులందరి భాగస్వామ్యం ఉండే శీర్షికలు నడపడానికి ప్రయత్నిస్తున్నాను. వాటికి మీ అందరి ప్రోత్సాహం మరింతగా ఉంటుందని, అలాగే తప్పుటడుగులు వేస్తే హెచ్చరికలు చేస్తుంటారని ఆశిస్తున్నాను.

మిత్రులందరికీ ' శిరాకదంబం ' అర్థవార్షికోత్సవం ( ఫిబ్రవరి 14 ) సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.

Vol. No. 01 Pub. No. 198

9 comments:

రవిచంద్ర said...

>>నాకు తెలిసిన, నేను చదువుకున్న విషయాలు నా దగ్గరే దాచుకోకుండా పదిమందికీ చెబుదామని, ఏదైనా విషయం గురించో, సమస్య గురించో నాలో కలిగే భావాల్ని పదిమందితో పంచుకుందామని మాత్రమే రాస్తున్నాను

మీరు మంచి ఉద్దేశ్యంతోనే రాస్తున్నారు. నిజానికి బ్లాగులు ప్రారంభమైందే అందుకోసం. ఇక వ్యాఖ్యలంటారా వాటిని గురించి అంతగా వర్రీ కానక్కర్లేదు. కొంత మందికి మీ టపాలు చదివినా వ్యాఖ్యానించే ఓపిక లేకపోవచ్చు. మీరు అందించిన సమాచారం వాళ్ళకు చేరిందా లేదా అనేదే ముఖ్యం. నా వరకు Anecdotes style లో మీరు ప్రచురించే టపాలంటే ఇష్టం.

జయ said...

రావ్ గారు, మీ బ్లాగ్ అర్ధవార్షికోత్సవ శుభాకాంక్షలండి. మీరు వివరించే అంశాలు చాలా వరకు తెలియనివే. మీరు చేసే కృషి సామాన్యమైనదేం కాదు. ఇదేవిధంగా ఇంకా ఎన్నో తెలియని విషయాలు తెలియ చేస్తారని ఆశిస్తూ, మరొక్కసారి నా అభినందనలు అందచేస్తున్నాను.

చిన్ని said...

"ఈ సందర్భంగా మరోవిషయం. ఒక సోషల్ నెట్ వర్క్ లో పరిచయమైన ఒక మిత్రుడు సూటిగా నన్నో ప్రశ్న వేసాడు. మీరు బ్లాగెందుకు రాస్తున్నారు ? సమాజాని ఉద్ధరించడానికా లేక రచనల ద్వారా సమాజంలో మీకొక గుర్తింపు తెచ్చుకుందుకా ? అని. అతనికి నేనిచ్చిన సమాధానం. నా రాతల వల్ల సమాజాన్ని ఉద్ధరించగలననే అత్యాశ నాకు లేదు. నేను రచయితనో, కవినో, సంఘ సంస్కర్తనో కానని నాకు తెలుసు. నాకు తెలిసిన, నేను చదువుకున్న విషయాలు నా దగ్గరే దాచుకోకుండా పదిమందికీ చెబుదామని, ఏదైనా విషయం గురించో, సమస్య గురించో నాలో కలిగే భావాల్ని పదిమందితో పంచుకుందామని మాత్రమే రాస్తున్నాను. అవి కొంతమందికైనా నచ్చితే, ఆహ్లాదం కలిగిస్తే, ఉపయోగపడితే మంచిదే ! ఇక సమాజంలో గుర్తింపుకోసమైతే ఇప్పుడు దాని అవసరం నాకెంతవరకూ ఉందో నా ప్రొఫైల్ చూస్తే తెలుస్తుందన్నాను. పేరు తెచ్చుకునే అవకాశాలు నా చేతిలో పుష్కలంగా ఉన్న కాలంలోనే ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు అవసరమా ? అదీకాక పాపులర్ అవడానికి ప్లాట్ ఫాం ఇది కాదేమోననుకుంటాను. చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో ప్రయత్నం చేస్తే పేరుతో బాటు, డబ్బు కూడా సంపాదించవచ్చేమో ! కానీ నాకా ఆశా, ఆసక్తి రెండూ లేవు. అందుకే పుస్తకాలు, మంచి స్నేహాలు తప్ప మరే ఆస్తి పాస్తులు లేవు".
చాల బాగా చెప్పారండీ .

కొత్త పాళీ said...

అభినందనలు. మీరు అందించిన పాత కాలపు సినిమా విడియో బిట్లు గొప్ప కానుక బ్లాగర్లకి.

Rao S Lakkaraju said...

కొన్ని కొన్ని పోస్టులు చదివిన తరువాత మనస్సులో ఒక మెరుపు మెరుస్తుంది. ఇంక ఆగలేము వ్రాసే దాకా. చదువరులలో ఆ పరిస్థితి మీరు కల్పించ గలిగారు. థాంక్స్ ఎగైన్.

Vinay Chakravarthi.Gogineni said...

mee blog baaguntundi.meeru koumudi.net lo raasina coloumski nenu pedda fan.........naaku nachhindi okati chepana meelo meeku vachhinadaani gurinchi meeru raastaaru...(only me field lone raastaaru)
pratidanlo velupettaru....migataavarilaaga.deeniki ento patience(control) kaavali.

all the best.........

SRRao said...

@ Ravichandra garu
@ Jaya Garu
@ Chinni garu
@ kottapali garu
@ Rao S. Lakkaraju garu

Andarikee Vandanalu

@ Vinaychakravarty garu
Thanq. One clarification. Koumudi.net lone kaadu, e magzinelonu intavaraku nenemee rayaledu sir. Naa raatalu bayitapettindi ee blog dvaarane.

Vinay Chakravarthi.Gogineni said...

ok..........akkada kooda oka coloum vundi..........atanu meeru anukuna no prob....but meekichhina complement manaspoortiga ichhinde...............

SRRao said...

వినయ్ చక్రవర్తి గారు
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం