Saturday, March 5, 2011

తెలుగు చిత్ర గంభీర స్వరం

1948 వ సంవత్సరం జనవరి 30 వతేదీ  
 ఆకాశవాణి వార్తల్లో మహాత్మాగాంధీ హత్య గావింపబడ్డారన్న వార్త ప్రసారమవుతోంది. ఆ వార్త శ్రోతలని ఎంత నిశ్చేష్టులను చేసిందో.... ఆ వార్తను చదివిన తీరు అంతగా వారిని దుఖః సాగరంలో ముంచేసింది. అప్పట్లో టీవీలు లేవు కదా ప్రత్యక్ష ప్రసారంగా ఆ విషాద సన్నివేశాన్ని చూడడానికి. రేడియోలోని, పత్రికల్లోని వార్తలే ప్రజలకు సమాచారం తెలుసుకునేందుకు ఆధారం. గాంధీజీ హత్య వార్తను గద్గద స్వరంతో చదివి ఆ సన్నివేశాన్ని శ్రోతల కళ్ళ ముందు ఉంచిన కంఠం కంచు కంఠం జగ్గయ్య గారిది.

 I am a man by birth
A socialist by connection
An artiste by temperment

         - అనేవారు జగ్గయ్య 

ఆయన తెలుగు చిత్ర గంభీరస్వరం 
ఆయన తెలుగు జాతికి గొప్ప వరం 

పదకొండవయేట హిందీ నాటకంలో లవుడి పాత్రలో రంగస్థల ప్రవేశం చేసారు. 
పద్నాలుగవయేట ' హంపి ' అనే కవితతో రచయిత అయ్యారు. 
ప్రఖ్యాత చిత్రకారుడు, రచయిత అడవి బాపిరాజు గారి దగ్గర చిత్రలేఖనం అభ్యసించారు. హైస్కూల్లో ఉండగానే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి ప్రముఖుల తైలవర్ణ చిత్రాలు వేసారు. 
ఇంటర్ చదువు పూర్తి కాగానే ' దేశాభిమాని ' అనే పత్రికకు సహాయ సంపాదకునిగా, ' ఆంధ్ర రిపబ్లిక్ ' అనే పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. 
మూఢనమ్మకాల వల్ల జరిగే నష్టాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథం అవసరమని నమ్మిన జగ్గయ్య రాజమండ్రిలో గోదావరిశాస్త్రి గారి వద్ద వాస్తు శాస్త్రం, బరోడాలో సాగభోగేశ్వర శాస్త్రి వద్ద జ్యోతిష్య శాస్త్రం, కెనడాలోని ఆచార్య ఋషికుమార పాండే వద్ద  హిప్నాటిజం నేర్చుకున్నారు. 
జగ్గయ్య తెనిగించిన రవీంద్రుని ' గీతాంజలి ' గురించి, ఆయన పరిష్కరించిన రాజకీయ పారిభాషిక పదకోశం గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే !
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జగ్గయ్య వర్థంతి ఈరోజు ( మార్చి 5 ). ఆ గంభీర స్వరానికి నీరాజనాలు అర్పిస్తూ ఆ స్వరం ఓసారి ......



జగ్గయ్య గారిపై గతంలోని టపా ...........

కళా వాచస్పతి

Vol. No. 02 Pub. No. 166

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం