Sunday, January 23, 2011

బ్రిటిష్ గాడిదలు

ఉద్యమ స్పూర్తి అనేది మన నాయకులు స్వాతంత్ర్యోద్యమం నుంచే నేర్చుకోవాలి. పదవులకోసమో, డబ్బుకోసమో ఆనాడు వారు ఉద్యమాలు చెయ్యలేదు. ఇంకా చెప్పాలంటే ఉద్యమకారుల్లో  చాలామంది తమ ఉద్యోగాలను, పదవులను, చివరికి డబ్బును కూడా వదులుకొని ఉద్యమం నడిపారు. అందుకే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పెత్తనాన్ని భారతదేశంలో అస్తమించేలా చెయ్యగలిగారు. ఉద్యమాలను వ్యాపారంగా మార్చిన ఈరోజుల్లో ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు. వారి నిబద్ధత, కార్యదీక్ష చేతల్లోనే కాదు...  మాటల్లో కూడా అడుగడుగునా ప్రతిధ్వనించేది.

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కరుడుగట్టిన స్వాతంత్ర్య వాది. తూటాల్లాంటి మాటలు వదలడంలో దిట్ట. అందులోను బ్రిటిష్ దొరల మీదనయితే ఇంక చెప్పనక్కరలేదు. ఒకసారి అయన పనిచేస్తున్న కాలేజీకి బ్రిటిష్ జాతీయుడైన గవర్నర్ వచ్చాడు. ఆ సందర్భంలో ఆ గవర్నర్ కాలేజీ లోని తరగతి గదులను పరిశీలిస్తూ గోపాలకృష్ణయ్య గారు పాఠం చెబుతున్న గదికి కూడా వచ్చాడు. ఆ సమయానికి మాష్టారు బోర్డు పైన రెండు గాడిద బొమ్మలు వేశారు. ఆది చూసిన గవర్నర్ అవేమిటని ప్రశ్నించాడు.

దానికి గోపాలకృష్ణయ్య గారు రెండింటినీ చూపిస్తూ " ఆది గాడిద.... ఇది కంచర గాడిద " అని వివరించారు.

అప్పుడు ఆ గవర్నర్ హేళనగా " మీ దేశంలో గాడిదలు ఉంటాయా ? మా దేశంలో లేవే !! " అన్నాడట.

వెంటనే దుగ్గిరాల వారు తడుముకోకుండా  " నిజమే సర్ ! మీ దేశంలోని గాడిదలన్నింటినీ బ్రిటిష్ ప్రభుత్వం మాదేశానికి తోలేసిందిగా ! ఇంకెలా వుంటాయి అక్కడ.... " అన్నారట. 

Vol. No. 02 Pub. No. 127

4 comments:

Rao S Lakkaraju said...

ఇంకా చెప్పాలంటే ఉద్యమకారుల్లో చాలామంది తమ ఉద్యోగాలను, పదవులను, చివరికి డబ్బును కూడా వదులుకొని ఉద్యమం నడిపారు.
-----
మధ్యతరగతి కుటుంబీకులు నాకు తెలిసిన వాళ్ళే వున్నారు. మా ఊళ్లోనే కాదు ప్రతి వూరిలోనూ. అందుకే అంత బలం వచ్చింది ఉద్యమానికి. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

Anonymous said...

:)baagundi

SRRao said...

* రావు గారూ !
* అను గారూ !

ధన్యవాదాలు

Anonymous said...

In those days so many great people gave up all of their life and wealth for their motherland. How many people are there like them in these days?Every where selfishness, influence and corruption is ruling every where.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం