Tuesday, January 11, 2011

గట్టి ప్రధాని

రోజూ ఉదయం నిద్ర లేచాక ఏడు గంటలకు డిల్లీ వార్తలు వచ్చే సమయానికి తప్పనిసరిగా రేడియో మ్రోగుతుండేది. 1966 వ సంవత్సరం జనవరి 11 వ తేదీ. ఆరోజు మామూలుగా రేడియో పెట్టిన మాకు వార్తలకు ముందుగా విషాద సంగీతం వినిపించింది. తర్వాత కొంతసేపటికి ప్రారంభమైన వార్తల్లో పిడుగులాంటి వార్త. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించారని. అంతకుముందు రెండు, మూడు నెలల క్రితం వరకూ పాకిస్తాన్ తో భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కోవడంతో అంత చిన్న వయస్సులో కూడా ఆయనంటే ఎంతో ఆరాధనా భావం ఏర్పడిపోయింది. శాంతి చర్చలకు రష్యా  వెళ్ళి మనకి ఇంక పాకిస్తాన్ బెడద లేకుండా చేస్తారని ఆశించిన ఈ దేశ ప్రజలందరికీ నిరాశ ఎదురయింది.


రూపానికి చిన్న
గుణానికి మిన్న
నీతి నిజాయితీకి మారుపేరు
మృదుభాషణ, సత్ప్రవర్తన ఆయన తీరు

పేదరికం ఆయన అనుభవించాడు
జీవితం అంటే ఏమిటో ఆయన నేర్చుకున్నాడు
ఆయన పరిపాలన పద్దెనిమిది నెలలే
ఆయన అందించిన సేవలు అనేక వేలు

దేశాన్ని కాపాడడానికి సైనికుడెంత ముఖ్యమో
ప్రజల ప్రాణాలను నిలబెట్టడానికి రైతు కూడా అంతే ముఖ్యమని నమ్మిన మహోన్నతుడు
అందుకే ' జై జవాన్ జై కిసాన్ ' అన్నాడు.

రైల్వే మంత్రిగా వున్నప్పుడు  జరిగిన రెండు ప్రమాదాల్లో
వందలాదిమంది మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ఆదర్శప్రాయుడు
అందుకే అంతులేని ప్రజాభిమానం చూరగొన్నాడు

ప్రధానిగా ఉంటూ కూడా చివరివరకూ తన కారు అప్పు వాయిదాలు తానే చెల్లించిన నిజాయితీపరుడాయన
ఈ దేశంలోని నిరుపేదల కోసం తన ఒకరోజు జీతాన్ని ప్రతీ నెలా విరాళంగా ఇచ్చిన కార్యశూరుడాయన
హరిత విప్లవాన్ని, శ్వేత విప్లవాన్ని ఈ దేశానికి అందించిన అభ్యుదయ యథార్థ వాది ఆయన  

మచ్చలేని రాజకీయనాయకుడు ఆయన
మంచితనానికి మారుపేరు ఆయన 
అందుకే అల్పాయుష్కుడయ్యాడు

మళ్ళీ లాల్ బహదూర్ ని మన రాజకీయాల్లో చూడగలమా ?
ఎప్పటికైనా మరో లాల్ బహదూర్ మన ప్రధానిగా వస్తాడా ?
అత్యాశైనా..... ఆశించడంలో తప్పులేదుగా ! అందుకని ఆశిద్దాం !!

 మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ..........

స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి ముందు పాల్గొన్న తాష్కెంట్ చర్చల విశేషాలు.........స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి సంస్మరణ కార్యక్రమం ( ఆయన కుమారుడు, మనవడితో )............Vol. No. 02 Pub. No. 113

6 comments:

Saahitya Abhimaani said...

Good Post Raojee. You have given an invaluable film clipping which I had never seen so far.

Had Lalbahadur Sastry lived and ruled the country atleast upto 1986, how our country would have progressed. We would not have seen lumpen elements taking over mainstream politics. It is the misfortune of the country that Shri Sastry died and cheap politicians followed him into the highest chair of the country.

kadambari said...

లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఆట్టే పట్టించుకోక పోవడం బాధ కలిగిస్తుంది.
మంచి వ్యాసంతో ఆయనను గుర్తు చేసారు.
Thank you S.R.Ravగారూ!
సంక్రాంతి శుభాకాంక్షలు

shankar said...

బహుశా రాజకీయ నాయకులలో నైతిక విలువల మరణం కూడా అదే రోజేమో. ఆయన విలువలలో ఒక్క శాతం, ఒక్కటంటే ఒక్కశాతం ఇప్పటి నాయకులలో ఉన్నా ఈ రోజు ఇన్ని స్కాములు ఉండేవి కావు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి గానే తెలిసిన నేటి తరం లో చాలా మందికి అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అన్న విషయం తెలియదు.

ఆ మహనీయునికి చక్కని నివాళి అందించి మరోసారి స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.

veera murthy (satya) said...

సంధర్బోచితమైన పోస్ట్...
నిజమైన స్వాభిమాని, దేశాభిమాని...శాస్త్రి!


ఇప్పూడూ ఉన్నాడు, ఓ ప్రదాని...ఎందుకు ?

సోనియా గాంధీ హైకమాండ్ ఆకలి భోజనానికి "చెంచా" గా తయారయ్యాడు....
అతివినయం ధూర్త లక్షణం అన్నట్టు పవర్తిస్తున్నాడు.

SRRao said...

* శివ గారూ !
* కాదంబరి గారూ !
* వీర ( సత్య ) గారూ !
ధన్యవాదాలు

SRRao said...

శంకర్ గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం