కోటి ఆశలతో... కొత్త కొత్త కోరికలతో
ఎదురుచూస్తున్నాం !
గత సంవత్సరపు చెడు జ్ఞాపకాలను చేరిపేసుకుంటూ
నువ్వు అందించబోయే తీపి గుర్తులను ఊహించుకుంటూ
మనుషుల మధ్య మత్సరాలు మాసిపోయె శుభ తరుణం
మనిషి మదిలో స్వార్థచింతన తగ్గిపోయే ఆనందకర క్షణం
ఇప్పటికైనా నువ్వు తీసుకురాగలవా ?
కులమతాల కుమ్ములాటలు, ప్రాంతాల మధ్య వైరుధ్యాలు
రాజకీయ ఉద్యమాలు, అధికార దీక్షలు, కుర్చీకోసం కుమ్ములాటలు
ఇవన్నీ లేని సంవత్సరాన్ని ఈసారైనా ఊహించగలమా ?
అవినీతి వటవృక్షం కూకటి వేళ్ళతో కూలిపోయే రోజు
రాజకీయ మురికి పోయి రామరాజ్యం వచ్చే రోజు
ఈ సంవత్సరమైనా వస్తుందా ?
నింగినంటిన ధరలు నేలకు దిగివచ్చే శుభదినం
అన్నదాత అందలమెక్కే శుభతరుణం
ఈ సారైనా మా కళ్ళతో మేం చూడగలమా ?
ఓ కొత్త సంవత్సరమా ! ఇలాగే ఇంకా చాలా ఆశలున్నాయి
ఓ రెండువేల పదకొండా ! ఇంకా బోలెడు కోరికలున్నాయి
ఇవన్నీ అత్యాశలు, అర్థం లేని కోరికలంటావా ?
అయినా ఆశపడటం, కోరుకోవటం మాకలవాటు
ఎందుకంటే ఆశ మా ఊపిరి, కోరిక మా నైజం
అందుకే ..............
నీ రాక కోసమే ఈ సంబరం
మంచి తెస్తావనీ..... మంచి చేస్తావనీ...............
నూతన సంవత్సర శుభాకాంక్షలతో ...................
Vol. No. 02 Pub. No. 105
21 comments:
:)మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Wish you a very happy and prosperous new year - 2011
~సూర్యుడు
ధన్యవాదములండీ. మీకు మీ కుటుంబానికి 2011 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ధన్య వాదములు.మీకూ నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలు .
రావుగారు మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
రావుగారు... మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
కేలండర్ చాలా బావున్నాదండీ, నేను download చేసుకున్నాను. thank you!
మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
happy new year
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
రావుగారు... మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
మీకూ, మీ కుటుంబసభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.....
Happy new year అండి. నిన్న ఎంచేతో ఓపెన్ కాలేదు...ఇవాళ పేజీ వెంఠనే తెరుచుకుంది...:)
రావు గారు. నూతన సవత్సర శుభాకాంక్షలండీ.
* అను గారూ !
* సూర్యుడు గారూ !
* ఊ. దం. గారూ !
* సిరిసిరిమువ్వ గారూ !
* పీతాంబర్ గారూ !
* ఆ. సౌమ్య గారూ !
* శోభారాజు గారూ !
* జయ గారూ !
* మాలకుమార్ గారూ !
* సత్యార్థి గారూ !
* పానుగంటి గారూ !
* శ్రీలలిత గారూ !
* తృష్ణ గారూ !
* భావన గారూ !
అందరికీ ధన్యవాదాలు.
మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా బ్లాగులో శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలండి. క్షమించండి. జవాబివ్వడానికి కొంచెం ఆలస్యమయింది.
శిశిర గారూ !
ధన్యవాదాలు
Post a Comment