Thursday, January 13, 2011

బంధుజనంతో జాగ్రత్త



 జంధ్యాల గారి జోక్స్   

 ఒకాయన ఇంటిమీదకు ఎప్పుడూ బంధుజనం వచ్చి పడుతుండేవారట. ఉన్నట్టుండి చుట్టాలు రావడం మానేసారట. ఎప్పుడూ గల గలలాడుతూ ఉండే ఇల్లు ప్రశాంతంగా వుండడం చూసి పక్కింటాయనకి ఆశ్చర్యమేసింది.
" ఏంటి సార్ ! ఈమధ్య మీ చుట్టాల రాక తగ్గింది. కుక్క వున్నది జాగ్రత్త లాంటి బోర్డు ఏమైనా తగిలించారా ? " అని అడిగాడు.

దానికా ఇంటాయన " అబ్బే ! కుక్క వున్నది జాగ్రత్త అనికాదు.... 'కుక్కలకు ఆహ్వానం' అని బోర్డు తగిలించాను. అంతే ! ఒక్కడొస్తే ఒట్టు " అన్నాడు.   

Vol. No. 02 Pub. No. 116

4 comments:

Dr.Suryanarayana Vulimiri said...

బాగుందండి. జంధ్యాల గారి జోకులు అద్భుతం. ఉదాహరణకు నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ. కడుపుబ్బ నవ్విస్తాయి అందులోని డైలాగ్స్.

Anonymous said...

అబ్బ, ఈ ఐడియా ఎంత బావుందో! :-))

నీహారిక said...

సంక్రాంతి శుభాకాంక్షలు రావు గారు.

SRRao said...

* సూరి గారూ !
* అజ్ఞాత గారూ !

ధన్యవాదాలు.

* నీహారిక గారూ !

ధన్యవాదాలు. మీక్కూడా భోగి పండుగ శుభాకాంక్షలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం