Tuesday, January 4, 2011

ఏడుపెందుకు ?

 జగ్గయ్య గారికి గంభీరమైన స్వరంతో బాటు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగానే ఉండేది. ఓసారి ఆయన షూటింగ్ కోసం లొకేషన్ కి చేరుకున్నారు. కానీ అక్కడ షూటింగ్ జరగడం లేదు. అందరూ ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

" ఏమిటి షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు ? " అని అడిగారు జగ్గయ్యగారు.

" ఇంకా సీన్ సిద్ధం కాలేదు. రచయిత గారు అదిగో ... ఆ ప్రక్కన కూర్చుని రాస్తున్నారు " అన్నాడట ఆ చిత్ర దర్శకుడు.

దానికి కొనసాగింపుగా సహాయ దర్శకుడు " సీన్ చాలా బాగా వస్తున్నట్లుంది సార్ ! రైటర్ గారు రాస్తూ ఏడుస్తున్నారు. " అన్నాడు.

" సీన్ రాస్తూ ఏడుస్తున్నారో, రాయలేక ఏడుస్తున్నారో ముందు కనుక్కో బాబూ ! " అన్నారట జగ్గయ్య గారు.


Vol. No. 02 Pub. No. 107

4 comments:

Anonymous said...

:)

Anonymous said...

:) రావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Rajendra Devarapalli said...

మీ బ్లాగ్గడపలోకి కాలు పెడితే ఇదే ఇబ్బంది రావు గారు,ఆలంకె,ఈ లంకె చూస్తూ కనీసం ఓ గంటన్నా గడపాల్సుంటుంది :)

SRRao said...

* అను గారూ !
* లలిత గారూ !

ధన్యవాదాలు

* రాజేంద్రకుమార్ గారూ !

మీ అభిమానానికి కృతజ్ఞతలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం