కనుక్కోండి చూద్దాం..... 32 - జవాబులు
సూర్య గారు చాలా వేగంగా సమాధానం చెప్పారు. కానీ తెలుగు తప్ప మిగిలిన భాషలలోని పేర్లు చెప్పలేదు. వారికి ధన్యవాదాలు.
1970 వ దశకంలో తమిళంలో ఒక ప్రముఖ దర్శకుడు విభిన్నమైన కథాంశంతో స్క్రిప్ట్ తయారుచేసుకుని ఫిలిం ఫైనాన్సు కార్పోరేషన్ కి పంపాడు. లేత వయసు కథానాయిక, వికలాంగుడు- అమాయకుడైన కథానాయకుడు గల ఆ స్క్రిప్ట్ సినిమాగా తీస్తే పెట్టుబడి తిరిగిరాదని సందేహించి వెనక్కి త్రిప్పి పంపారు వారు.
అయితే ఆ దర్శకుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా తిరిగి కొంతమందిని ఒప్పించి పెట్టుబడి పెట్టించి మొత్తానికి సినిమా తీసాడు. ఆ చిత్రాన్ని తెలుగులో మరో ప్రముఖ దర్శకుడు పునర్నిర్మించాడు. ఆ చిత్రంలో నటించిన కథానాయిక ఆ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని తర్వాతి కాలంలో భారత దేశంలో అగ్ర కథానాయికగా ఎదిగింది. అదే చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించారు. అలా ఫిలిం ఫైనాన్సు కార్పోరేషన్ తిరస్కరించిన ఆ స్క్రిప్ట్ మూడు భాషల్లో చిత్రాలుగా నిర్మింపబడి ఘనవిజయం సాధించింది.
1 . మూడు భాషల్లోనూ ఆ చిత్రం పేర్లేమేమిటి ?
జవాబు - పదునారు వయదినిలై ( తమిళం ) , పదహారేళ్ళ వయసు ( తెలుగు ) , సోల్వా సావన్ ( హిందీ )
జవాబు : భారతీ రాజా
అగ్ర శ్రేణి తారగా వెలిగిన ఆ నటి శ్రీదేవి అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను .
కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ' పదహారేళ్ళ వయసు ' లోని వేటూరి గారి సాహిత్యం, చక్రవర్తి సంగీతం కలబోసిన మధుర గీతం .........................
Vol. No. 02 Pub. No. 063a
2 comments:
రావు గారు, నేను మీ ప్రశ్నను పూర్తిగా చూడలేదు. మీ సమాధానం లో చిన్న సవరణ. హిందీ చిత్రం పేరు 'సోల్వా సావన్", "సోల్వా సాల్" కాదు.
సూరి గారూ !
సవరణ సూచించినందుకు ధన్యవాదాలు. దేవానంద్, వహీదా నటించిన సోల్వా సాల్ (1958) గుర్తులో వుండిపోయి కన్ ఫ్యూజ్ చేసినట్లుంది.
Post a Comment