మళ్ళీ వచ్చే నాగులచవితి
..............
గోగు మొక్కల దివిటీలు
దుష్టశక్తులను తరిమే కమిచీలు
పిల్లలకు అవి రక్షణ కవచాలు
ఏవీ ఎక్కడా ఆ దివిటీలు ....
ఇక అవి గతకాలపు జ్ఞాపకాలు
మతాబులు.... కాకర పువ్వోత్తులు......
చిచ్చుబుడ్లు..... పటాసులు........
చిన్ని చిన్ని బుడతల కళ్ళల్లో మెరిసే కాంతులు
చెడును పారద్రోలి మంచిని తెచ్చిన నవ్యక్రాంతులు
కుళ్ళు, కుత్సితాలును పారద్రోలే రోజు
అన్యాయం, అక్రమాలను రూపుమాపే రోజు
స్వార్థం, అధర్మాలను అంతం చేసే రోజు
దోపిడీలను, దౌర్జన్యాలను అరికట్టే రోజు
మనకి అసలైన దీపావళి ఆ రోజు

చైతన్య దివిటీలు వెలిగిద్దాం
అజ్ఞానపు చీకట్లు తొలగిద్దాం
దుష్టశక్తులను తరిమికొడదాం !
అందుకే దిబ్బు దిబ్బు దీపావళి ........
Vol. No. 02 Pub. No. 050
8 comments:
రావుగారూ!మీకు,మీ కుటుంబానికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
దీపావళి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
రావు గారు
నమస్తే. మీకు, మీ కుటుంబానికి కూడా దీపావళి శుభాకాంక్షలు.
మీకు,మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
మిత్రులందరికీ పేరుపేరునా .........
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.
రావు గారు మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
శ్రీ పద్మ గారూ !
ధన్యవాదాలు
Post a Comment