అక్కినేనికి గ్లామర్ హీరోగా గుర్తింపు తెచ్చిన చిత్రం బాలరాజు
ఆంధ్ర దేశమంతా అప్పుడే బాలరాజు మీసాలు మొలిచాయి
తారల ఫ్యాన్ మెయిల్ ను తుఫాన్ మెయిల్ గా మార్చింది బాలరాజు
' బి ', ' సి ' సెంటర్లు ' ఎ ' సెంటర్లుగా మార్చేసింది బాలరాజు
కొత్త సినిమా హాళ్ళకు పునాదులేసింది బాలరాజు
ఇంత ఘన చరిత్ర కలిగి అక్కినేని వారికి తెలుగు చిత్ర సీమలో పదిలమైన స్థానాన్ని కల్పించిన బాలరాజు, ఆ రోజుల్లో ఆయనకి కూర్చునేందుకు కుర్చీ కూడా ఏర్పాటు చెయ్యలేకపోయింది. ఆ వైనంబెట్టిదనిన...........
బాలరాజు షూటింగ్ సమయంలో కాల్ షీట్ ఉదయం ఏడు గంటలకంటే అక్కినేని ఒక గంట ముందే అంటే ఉదయం ఆరు గంటలకే స్టూడియోకి వచ్చేవారు. అయితే అప్పటికింకా సిబ్బంది ఎవరూ వచ్చేవారు కాదు. హీరో గారికి కూర్చునేందుకు కుర్చీ కూడా ఉండేది కాదు. సిబ్బంది వచ్చేవరకూ ఆయన నిలబడి వుండాల్సివచ్చేది. ఇక ఇది పని కాదని అక్కినేని వారే తన ఇంటినుంచి ఓ కుర్చీని కారులో వేసి తెచ్చుకునేవారు. ఆనాటి శోభనాచల స్టూడియోలోని ఓ వెలగ చెట్టు క్రింద ఆ కుర్చీ వేసుకుని కూర్చునేవారు. మేకప్ సిబ్బంది వచ్చేవరకూ ఏ న్యూస్ పేపరో చదువుకుంటుండేవారు.
ఈ బాలరాజు కుర్చీ వ్యవహారం చూసి ఇదేదో హీరోకుండాల్సిన లక్షణాల్లో ఒకటి అనుకున్నారో ఏమో తర్వాతి కాలంలో హీరోలందరూ స్వంత కుర్చీలు తెచ్చుకోవడం సంప్రదాయమైంది.
ఘంటసాల గారి గురించి ఆ బాలరాజు ఆడిన ఓ మాట..... పాడిన ఓ పాట ................
Vol. No. 02 Pub. No. 061
5 comments:
తర్వాతి కాలంలో హీరోలందరూ స్వంత కుర్చీలు తెచ్చుకోవడం సంప్రదాయమైంది.
:->))
భలే భలే విషయాలు రాస్తారండీ మీరు :-)
హ హ మంచి విషయం చెప్పారు.
బాలరాజు సినిమా చూద్దామంటే ఎక్కడా దొరకట్లేదు,అదేంటో :(
పాత సినిమాలలో నేను మిస్ అయిన సినిమాలు బాలరాజు, బాటసారి, ముగ్గురు మారాఠీలు, ఈ మూడు మాత్రం నాకెక్కడా దొరకట్లేదు. :(
* కాదంబరి గారూ !
* వేణు శ్రీకాంత్ గారూ !
ధన్యవాదాలు
* సౌమ్య గారూ !
ధన్యవాదాలు. మీరు ఈ క్రింది లింక్ లో బాలరాజు చూడొచ్చు.
http://www.bharatmovies.com/telugu/watch/Balaraju-movie-online.htm
బాటసారి లింక్ -
http://www.bharatmovies.com/telugu/watch/Batasari-movie-online.htm
ముగ్గురు మరాఠీలు మాత్రం నెట్ లో దొరకలేదండీ !
Oh thanks a lot, i will watch them.Thank you so much!
Post a Comment