తెలుగుజాతికి గర్వ కారణం
మధురమైన పాటల నందనం
గానకోకిలమ్మ సుశీలమ్మకు వందనం
తెలుగు పాట పాడింది
యావత్ జాతి నాట్యమాడింది
తమిళ, కన్నడ పాటలు పాడింది
ఆ భాషా శ్రోతల ఆరాధ్య గాయని అయింది
ఆమె గానానికి తనువంతా పులకించింది
ఆమె పాట విని జగమంతా పరవశించింది
ఆ గానవాహిని కలకాలం సాగిపోవాలని
తెలుగు జాతి ఆ వాహినిలో పులకించి పోవాలని
.............. కోరుకుంటూ
గానకోకిలమ్మ సుశీలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
క్రిందటి జన్మదిన శుభాకాంక్షలు ఈ లింక్ లో చూడండి.
http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_13.html
4 comments:
ఎప్పటి పాటో మళ్ళీ వినిపించారు. సుశీల గానం గాంధర్వ గానమే. నా శుభాకాంక్షలు కూడా.
chakkani paatanu malli vine adrushtam kaligindi, Chaala Thanks.
గాన కోకిల సుశీల గారి గురించి మీరు చెప్పిన మాటలు
బాగున్నాయి
* జయ గారూ !
ధన్యవాదాలు
* అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు. మీ పేరు తెలియజేస్తే బాగుండేది.
* అప్పారావు గారూ !
ధన్యవాదాలు. సుశీల గారి గురించి మీ టపా కూడా చదివాను. చాలా బావుంది. అంతర్జాల సంధానంలో ఇటీవల చాలా ఇబ్బందులు ఎదురవుతుండడంతో నా టపాలు ప్రచురించడం, మిత్రుల టపాలు చదవడం, వ్యాఖ్యలు రాయడం కష్టమవుతోంది. అందుకని చదివిన వ్యాఖ్య రాయాలనుకున్నా వెంటనే రాయలేకపోయాను. ఇక్కడ రాస్తున్నందుకు మన్నించండి.
Post a Comment