Tuesday, December 1, 2009

చరిత్ర పునరావృతం

1969
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర నినాదంతో హోరెత్తింది
భవిష్యత్తు పై కలలుకన్న విద్యార్థులెందరో బలయ్యారు
వారి ఆవేశమే స్వార్థరాజకీయ నాయకుల పెట్టుబడి
ఉద్యమం ఆ నాయకుల చేతిలోనే బలయ్యింది
1973
ప్రత్యేక ఆంధ్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసింది
ఇందులో కూడా విద్యార్థులే బలయ్యారు
అర్థ సంవత్సరం పైన నడిచింది
ఈ ఉద్యమం కూడా షరా మామూలే !
2009
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృత రూపం దాల్చింది
విద్యార్థులూ.....!! బహు పరాక్ !!!
మరోసారి నాయకుల రాజకీయ లబ్దికి బలవకండి
చరిత్ర ఇప్పటికే పునరావృత్తమయింది

Vol. No. 01 Pub. No. 122

2 comments:

Saahitya Abhimaani said...

ప్రజా సమూహానికి జ్ఞాపక శక్తి తక్కువ. ఎవరికి వారు తెలివిగలవారే. గుంపులో గోవిందగా ఉన్నాపుడు తెలివి తక్కువ దద్దమ్మలు. గుంపుకు తెలివితేటలు మృగ్యం. అందుకనే, ఈ రాజకీయ నాయకుల పదోన్నతికి వారధిగా నిలుసుతున్నది ఈ గుంపు అలోచనా విధానం. ఒకసారి కాదు, అనేకసార్లు.

SRRao said...

నిజం చెప్పారు శివగారూ ! ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం