Sunday, December 6, 2009
మహానటీ ! నీవు లేక...!!
నీవు లేక వీణా పలుకలేనన్నది !
నీవు లేక వెండి తెర వెల వెల పోయినది !!
కనులు కనులతో కలబడితే
కనులే మనతో మాటలాడితే
జీవితంలోనటించడం చాలామందికి తెలుసు
నటనలో జీవించడం కొందరికే తెలుసు
వారిలో అగ్ర తాంబూలం మహానటి సావిత్రిదే !
గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబర్ 6 వ తేదీన ఉదయించిన ఈ తార 13 ఏళ్ళ వయసులో 1949 లో ' అగ్ని పరీక్ష ' చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు చలన చిత్ర సీమలో తళుక్కున మెరిసింది.
1950 లో ' సంసారం ' చిత్రంలో రెండవ హీరోయిన్ కాబోయి మళ్ళీ చిన్న పాత్రతో సరిపెట్టుకుంది.
1951 లో ' పాతాళ భైరవి ' లో నృత్యం చేసింది.
1952 లో ' పెళ్లి చేసి చూడు ' చిత్రంలో రెండవ హీరోయిన్ పాత్ర దక్కింది.
1953 లో ' దేవదాసు ' చిత్రంతో ఆమె నటజీవితం మలుపు తిరిగింది.
1954 లో ' మనంబోల మాంగల్యం ' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో జెమిని గణేషన్ ను వివాహమాడారు.
1958 లో విజయ చాముండేశ్వరి, 1965 లో సతీష్ ఆమె సంతానంగా జన్మించారు.
1960 లో ' చివరకు మిగిలేది ' చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగులో చిన్నారి పాపలు, మాతృదేవత, వింత సంసారం మొదలైన చిత్రాలకు
తమిళంలో ఉళ్ళం, ప్రాప్తం చిత్రాలకు సావిత్రి దర్శకత్వం వహించారు.
నిర్మాతగా వ్యవహరించిన ' ప్రాప్తం ' చిత్ర సీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిన ఆ మహానటి పతనానికి పునాది వేసింది.
మహానటి సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా సృత్యంజలి
Vol. No. 01 Pub. No. 127
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
6 comments:
ఆ మహానటి ని ఎవ్వరూ...ఎప్పటికీ మర్చిపోలేరు. చాలా మంచి ప్రయత్నం చేసారు. ఇన్ని వివరాలు తెలియచేసిన మీకు నా కృతజ్ఞతలు. ఆ మహా నటికి ఈ లోకంలో లేకపోయినప్పటికీ నా జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
జయ గారూ !
మనకి ఎన్నో ఆణిముత్యాలున్నాయి. వారిని ఇలాంటి సందర్భాలలోనైనా ఒక్కసారి స్మరించుకుంటే వారిలోని మంచి లక్షణాలు కొన్నైనా మనకి స్పూర్తిని కలిగిస్తాయేమోనని ఒక చిన్న ఆశ. మీ స్పందనకు ధన్యవాదాలు.
ఈ టపా లో ఏ వీడియో లంకె నొక్కినా, 'This is a private video..' అన్న మెసేజ్ వస్తోంది :(
S గారూ !
ముందుగా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు. డా. చక్రవర్తిలోని పాట మాత్రం బాగానే ప్లే అవుతోంది. ఎందుకో అది తప్ప మిగిలిన పాటలు మాత్రం నా యు ట్యూబ్ చానెల్ లో ప్రైవేటు లోకి వెళ్ళాయి. ఏ సందర్భంలో అలా జరిగిందో గుర్తు రావడం లేదు. ఇప్పుడు సరి చేసాను.
మహానటి అభినేత్రి సావిత్రి గారిగురించి ఎంత చెప్పుకున్నా తనివితీరదు. అల్లాంటి వ్యక్తులు బహు అరుదుగా వుంటారు. ఎన్నాళ్ళు జీవించావనికాదు ఎంత గొప్పగా జీవించేవు అన్న అర్ధానికి నిలివెత్తు ఉదాహరణ సావిత్రి గారు. ఆమెను 1964 ప్రాంతాన్న మా రాజమండ్రి కి అక్కినేని వారితో మూగమనసులు చిత్ర ప్రదర్శన సమయంలో వచ్చినప్పుడు ప్రత్యక్షం గా చూసే భాగ్యం కలిగింది. అటువంటి మహా మనీషి మన గడ్డ ఆడబడచుగా పొందడం అమె సమకాలికుడనవ్వడం నా అదృష్టం గా భావిస్తా.
శివసుబ్రహ్మణ్యం గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు
Post a Comment