

విజయా సంస్థ అధినేత బి. నాగిరెడ్డి గారు. తెలుగు ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత. అనుభవంతో ఆయన చెప్పిన మాటలు ఎలా నిజమయ్యాయో చూడండి.
సూపర్ స్టార్ కృష్ణ ఎంతో వ్యయ ప్రయాసలతో సాహసోపేతంగా నిర్మించిన తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం ' అల్లూరి సీతారామరాజు '. అది కృష్ణ కి నూరవ చిత్రం కూడా !
ఆ
చిత్రం ప్రివ్యు చూసిన నాగిరెడ్డి గారు కృష్ణ ను అభినందించారు. సూపర్ హిట్ అవుతుందని జోస్యం చెప్పారు. కానీ ఒక ప్రశ్న వేశారు, " ప్రస్తుతం

ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నావు ? " అని. కృష్ణ చెప్పారు. " అయితే వాళ్ళందరు మట్టికొ
ట్టుకు పోతారు " అన్నారు నాగిరెడ్డి గారు. కృష్ణ గారికి అర్థం కాలేదు. ఆయన అలా అయోమయంలో ఉండగానే నాగిరెడ్డి గారు " సీతారామ రాజుగా బాగా చేసావు. నీ చిత్రం సూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు. దాంతో చాలా కాలం పాటు తెలుగు ప్రేక్షకులకి అల్లూరి సీతారామ రాజు గానే గుర్తుండి పోతావు. వాళ్లు ఆ ఇమేజ్ నుంచి త్వరగా బయిట పడరు. కనుక నీ తర్వాత చిత్రాలన్నీ ఫ్లాప్ అవక తప్పదు " అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ' అల్లూరి సీతా
రామ రాజు ' చిత్రం తర్వాత కృష్ణ నటించిన 14 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.
Vol. No. 01 Pub. No. 130
3 comments:
అందుకే ఆయన అంత గొప్ప సంస్థ స్తాపించగలిగేరు.
భావన గారూ !
ధన్యవాదాలు
hai friends
nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
ee link lo choosi me comments teliyajeyandi.
http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html
Post a Comment