విజయా సంస్థ అధినేత బి. నాగిరెడ్డి గారు. తెలుగు ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత. అనుభవంతో ఆయన చెప్పిన మాటలు ఎలా నిజమయ్యాయో చూడండి.
సూపర్ స్టార్ కృష్ణ ఎంతో వ్యయ ప్రయాసలతో సాహసోపేతంగా నిర్మించిన తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం ' అల్లూరి సీతారామరాజు '. అది కృష్ణ కి నూరవ చిత్రం కూడా !
ఆ చిత్రం ప్రివ్యు చూసిన నాగిరెడ్డి గారు కృష్ణ ను అభినందించారు. సూపర్ హిట్ అవుతుందని జోస్యం చెప్పారు. కానీ ఒక ప్రశ్న వేశారు, " ప్రస్తుతం ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నావు ? " అని. కృష్ణ చెప్పారు. " అయితే వాళ్ళందరు మట్టికొట్టుకు పోతారు " అన్నారు నాగిరెడ్డి గారు. కృష్ణ గారికి అర్థం కాలేదు. ఆయన అలా అయోమయంలో ఉండగానే నాగిరెడ్డి గారు " సీతారామ రాజుగా బాగా చేసావు. నీ చిత్రం సూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు. దాంతో చాలా కాలం పాటు తెలుగు ప్రేక్షకులకి అల్లూరి సీతారామ రాజు గానే గుర్తుండి పోతావు. వాళ్లు ఆ ఇమేజ్ నుంచి త్వరగా బయిట పడరు. కనుక నీ తర్వాత చిత్రాలన్నీ ఫ్లాప్ అవక తప్పదు " అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ' అల్లూరి సీతారామ రాజు ' చిత్రం తర్వాత కృష్ణ నటించిన 14 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.
Vol. No. 01 Pub. No. 130
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
3 comments:
అందుకే ఆయన అంత గొప్ప సంస్థ స్తాపించగలిగేరు.
భావన గారూ !
ధన్యవాదాలు
hai friends
nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
ee link lo choosi me comments teliyajeyandi.
http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html
Post a Comment