Sunday, December 6, 2009

బ్లాగర్ మిత్రులకు విన్నపం

సీనియర్ బ్లాగెర్ కొత్తపాళీ కొత్తగా కథల సంపుటి వెలువరిస్తున్నారు.
ఈ రోజు సాయింత్రం గం. 5.00 లకు విజయవాడ లోని బందరులాకుల దగ్గరున్న
స్వాతంత్ర్య సమరయోధుల సంఘం లో ఆవిష్కరణ సభ జరుగుతోంది.
విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలలోని బ్లాగెర్లందరు తప్పక హాజరు
కావలిసినదిగా శిరాకదంబం విజ్ఞప్తి చేస్తోంది.
బ్లాగ్ కుటుంబంలో జరుగుతున్న ఈ సంబరంలో పాలు పంచుకుని ఈ సభను విజయవంతం చేద్దాం !
అలాగే మీ సాహితీ మిత్రులకు, సాహిత్యాభిమానులకు ఈ సమాచారాన్ని
తెలియజేసి వారికి కూడా పాల్గొనే అవకాశం కలుగజేయ్యండి.

Vol. No. 01 Pub. No. 128

8 comments:

జయ said...

ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో ఉండిఉంటే ఎంతబాగుండేదో కదా...

SRRao said...

జయ గారూ !
మీకంటే మేమే అదృష్టవంతులం. ఎందుకంటారా ? ఒకటి. విజయవాడలో జరుగుతున్నందుకు, రెండు హైదరాబాదులో ఈ రోజు జరగనందుకు. అదెలాగంటే ఈ రోజు బంద్ వాతావరణంలో సభకు హాజరవడం ఒక సమస్య అయితే, హాజరయినా హాయిగా ఆ అనందాన్ని అనుభవించే పరిస్థితి లేనందుకు. కనుక రావడానికి అవకాశం లేని మీ అందరి తరఫునా వకాల్తా తీసుకుని నేను హాజరవుతున్నాను.

karthik said...

congrats to kottapali garu

SRRao said...

కార్తీక్ గారూ !
మీ అభినందనలు కొత్తపాళీ గారికి అందజేస్తాను.

సంతోష్ said...

మాది గుంటూరే అండి .
కానీ కొన్ని కారణాల వలన బెజవాడ వెళ్ళలేకపోయాను .
రేపు కూడా ఆయన అక్కడే ఉంటారా అండి .???

SRRao said...

సంతోష్ గారూ !
కొత్తపాళీ గారు ఇంకా కొన్ని రోజులు విజయవాడలోనే ఉంటారు. మీరు కలవవచ్చు.

సంతోష్ said...

ekkada vuntaaro???

SRRao said...

సంతోష్ గారూ !
ఆయన్ని నిన్న సభ దగ్గరే కలిసాను. చిరునామా తెలియదు. మళ్లీ ఆయన ఫోన్ చేస్తానన్నారు. చేసినపుడు వివరాలు తీసుకుని తెలియజేస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం