Friday, December 11, 2009
శ్రీశ్రీ చతురోక్తులు
శ్రీశ్రీ గారి మాటల్లో శ్లేషలకు కొదవలేదు. సందర్భోచితంగా చతురోక్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరైనా ఆయన్ని ప్రశ్నించడం పాపం ఠక్కున సమాధానం వచ్చేసేది. వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన సమాధానాలలో కొన్ని......
* ' బ్రతుకు ' అంటే అర్థం...... - ' చావకు ' అని.
* బీదవాడికి, సంపన్నుడికి బేధం......... - బీదవాడు ఎప్పటికైనా సంపన్నుడు కావాలని కోరుకుంటాడు. కానీ సంపన్నుడు ఎప్పటికీ బీదవాడు కావాలని కోరుకోడు.
* జనన మరణాలమీద మీ అభిప్రాయం......... - నా అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ఇదివరలో ఇవి సంభవించాయి. ఇక మీద కూడా సంభవిస్తూనే ఉంటాయి.
* రాతల్లో బోలెడు నీతిని ప్రబోధించే మీరు నీతిగా ఉంటారా ? - ఉరికి దారి చెబుతూ రోడ్ మీద బోర్డ్ ఉంటుంది. ఆ రోడ్ వెంట మనం వెళ్ళాలి గానీ ఆ బోర్డు వెళ్ళదు కదా !
* దేశంలో లంచాలు తీసుకునే వాళ్ళందర్నీ ఉరి తీసేస్తే....... - లంచాలిచ్చేవాళ్ళు మిగులుతారు.
* భగవంతుడ్ని ప్రార్థించేటపుడు కళ్ళెందుకు మూసుకుంటారు ? - తమది గుడ్డి నమ్మకం అని తెలియజేయ్యడానికి.
* శ్రీనాథుడికీ, శ్రీశ్రీకీ ఉన్న తేడా....... - శ్రీనాథుడి కావ్యాలు చదివి శ్రీశ్రీ ఆనందించాడు. శ్రీనాథుడికి ఆ అవకాశం లేకపోయింది.
Vol. No. 01 Pub. No. 133
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
6 comments:
ఎక్కడ కలెక్ట్ చేసారోగాని, రావ్ గారు...చలోక్తులు భలే ఉన్నాయ్.
జయ గారూ !
గత ముఫ్ఫై సంవత్సరాల పత్రికా సంపద సేకరణలోంచి నాకు నచ్చినవి అందిస్తున్నానండి. మీకు కూడా నచ్చుతున్నందుకు సంతోషం.
chaalaa baagunnaayi anDi :) SreeSree naastikuDaa? paapam :P
(PS: No offence, just for fun.)
సందీప్ గారూ !
ధన్యవాదాలు.
chalokthu chala bagunai rao garu ..thanks thanks alot
ఆదిత్య గారూ !
ధన్యవాదాలు
Post a Comment