Thursday, December 10, 2009

చరిత్ర చెప్పిన ఉద్యమ సత్యాలు

1921 - ఇతర భాషల వారు తెలుగు భాషను చిన్న చూపు చూడటం సహించలేక తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి నిజాం పాలన క్రింద ఉన్న తెలంగాణా ప్రాంతంలో టేకుమళ్ళ రంగారావు, కె.వి.రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మొదలైన వారు ' ఆంధ్ర జన సంఘం ' ఏర్పాటు చేశారు.
1937 - నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర సభలో బాధ్యతాయుతమైన పాలన కావాలని, బ్రిటిష్ ఇండియాలో వలె సంస్కరణలు అమలుచేయ్యాలని మొదటి రాజకీయ తీర్మానం చేశారు.
1938 - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటయింది. నిజాం దానిని నిషేధించాడు.
1939_ 40 - సోషలిస్ట్ భావాలతో కమ్యూనిస్ట్ పార్టీ అవతరించింది.
1946 - హైదరాబాద్ సంస్థానంలో రాజకీయాలు మితవాద, అతివాద రాజకీయాలుగా విడిపోయాయి.
వీరిని అణచడానికి నిజాం అండదండలతో ' రజాకార్లు ' తయారయ్యారు.
1947 - భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం నవాబు భారత యూనియన్ చేరకుండా యథాతథ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలంగాణా ప్రజలపై రజాకార్ల ఆగడాలు పెరిగిపోయాయి.
1948 - భారత ప్రభుత్వ సైనిక చర్యతో తెలంగాణా ప్రజలకు నిజాం పీడ వదిలిపోయింది.
1952_56 - హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విశాలాంధ్ర ఏర్పాటు ప్రయత్నాలు సాగుతున్నపుడు కొందరు తెలంగాణా విడిగానే ఉండాలని పట్టుబట్టగా బూర్గుల రామకృష్ణారావు వారికి మద్దతిచ్చారు. విశాలాంధ్ర ఖాయమని తేలిపోయాక అభిప్రాయం మార్చుకుని దానికి తన మద్దతును ప్రకటించి ద్వంద్వ నీతిని ప్రదర్శించారు.
1956 - రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదిక ఆధారంగా కుదిరిన పెద్దమనుష్యుల ఒప్పదం ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగు వారందిరినీ ఏకం చేస్తూ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేసింది.
1969 - ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఋజువు కావడంతో చెన్నారెడ్డిని ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చెయ్యకూడాదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో తెలంగాణా వారిని ఆంధ్ర వాళ్లు అణగదొక్కుతూన్నారంటూ ఉద్యమం ప్రారంభమయింది. వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలమంది జీవితాలు బలయ్యాయి. కానీ ఆ ఉద్యమం చెన్నారెడ్డి రాజకీయానికి బలైపోయింది.
1972 - తెలంగాణా ఉద్యమ ఫలితంగా అధిష్టానం బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించి తెలంగాణా ప్రాంతానికి చెందిన పి. వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా చేసింది. ఈ చర్యకు ఫలితంగా భూసంస్కరణలు అమలు, ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్ట్ స్టే కారణాలుగా చూపుతూ ప్రత్యేకాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. చివరికి అది కూడా రాజకీయ ప్రయోజనాలకి బలయిపోయింది.

ఏ ఉద్యమ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
అమాయకుల బలిదానం
నాయకుల స్వలాభం
ఇది చరిత్ర చెప్పిన సత్యం

సమ్మె ఘెరావు దొమ్మీ
బస్సుల దహనం లూటీ
శాంతీ సహనం సమ ధర్మంపై
విరిగెను గూండా లాటీ
గాంధీ పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా !
.......... ( పాటను చూడండి ! )




Vol. No. 01 Pub. No. 132

3 comments:

Sandeep P said...

చక్కని లోతున్న వ్యాసం. బాగా వ్రాసావు సోదరా. కానీ మన చేతుల్లో ఇంకేమీ లేదు.

Anonymous said...

chala bavundandi.nadustunna charitranu kuda rayandi.telugu talli entaga vilapistondo

SRRao said...

సందీప్ !
చాలా సంతోషం సోదరా ! మన చేతుల్లో ఏదీ ఎప్పుడూ ఉండదు. రాజకీయ నాయకులు ఉంచరు. అయినా మళ్ళీ మళ్ళీ వాళ్ళనే నమ్ముతాం ! వాళ్ళకే ఓట్లు వేసి గెలిపిస్తాం !! ఆ బలహీనతే వారి పెట్టుబడి.
అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు. నడుస్తున్న చరిత్ర ఎన్ని మలుపులు తిరుగుతోందో ప్రత్యక్షంగా చూస్తున్నారుగా ! కొత్త రాజకీయ నాటకానికి తెర లేచింది. ఈ దుస్థితిని చూసి రాల్చడానికి కన్నీళ్ళు కూడా లేకుండా చేస్తున్నారు తెలుగు తల్లికి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం